(GK హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18)
ఇంటర్మీడియట్(Intermediate) పూర్తయిన విద్యార్థులు(Students) ఇంజినీరింగ్(Engineering) వంటి కోర్సులు (Courses) చదవాలన్నా.. సాంప్రదాయిక డిగ్రీల్లో చేరి ఉన్నత విద్యలో రాణించాలన్నా.. రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో ఎన్నో యూనివర్సిటీలు(Universities) పలు కోర్సుల ద్వారా అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇంటర్ తరువాత విద్యార్థుల ముందు రెండు మార్గాలున్నాయి. అవి ఉన్నత విద్య, ఉపాధి. ఈ రెండిట్లో ఏది అవసరమో ఎంచుకునేందుకు పలు రకాల పరిస్థితులు దోహదం చేస్తాయి.సైన్స్ సబ్జెక్టులతో(Science subjects) ఇంటర్(Inter) పూర్తిచేసిన వారిలో ఎక్కువ శాతం మంది చూపు ఇంజినీరింగ్ పైనే ఉంటుంది. అందుకే ఏటా ఇంజినీరింగ్‌కు ఎంసెట్‌కు లక్షల్లో విద్యార్థులు పోటీ పడుతుంటారు. సీట్లు పెరుగుతున్నా పోటీ మాత్రం తగ్గడంలేదు.
ఉన్నతమైన భవిష్యత్తుకు త్వరగా ఉద్యోగం సంపాదించడానికి ఇంజినీరింగ్ సులువైన మార్గం అందుకే తల్లిదండ్రుల్లోనూ ఇంజినీరింగ్ అంటే ఆసక్తి ఎక్కువే. అందుకే ఎంసెట్ లో మంచి రాంక్ సాధించాలంటే మాత్రం ఈ పద్ధతిని పాటించండి. ఎంసెట్ ఎగ్జామ్స్ కు టైం దగ్గర గా ఉంది కాబట్టి ప్రిపరేషన్ లో కొత్త టాపిక్ల జోలికి వెళ్లకుండా మీరు నేర్చుకున్న దానిలో పరిపూర్ణత సాధించండి. దీనిపై సూచలను, సలహాలు టిప్స్ అందించారు తిరుపతి జిల్లా ఎస్వీ జూనియర్ కాలేజీ లెక్చరర్ ప్రియవర్ధన్ బాబు.
ఏపీ ఎంసెట్ విద్యార్థులు ప్రణాళికతో సిద్ధమైతేనే మంచి మార్కులు పొందగలరు. సబ్జెక్టు వారీగా ఇంపార్టెంట్ చాప్టర్లను బట్టి పట్టే విధానం వదులుకోవాలి. ప్రతి ఇంపార్టెంట్ చాప్టర్ ను అర్థం చేసుకొని వాటిని ప్రాక్టికల్ గా గుర్తుపెట్టుకోవాలి. మంచి మార్కులు తెచ్చుకోవాలంటే విద్యార్థుల్లో అవగాహన ఎంతో ముఖ్యం. జూనియర్ ఇంటర్ మొదటి సంవత్సరంలోని బోటనీ(Botany) సబ్జెక్టులోని వేర్లు వాటి రూపాంతరాలు బాగా చదువుకోవాలి.
ఆకులకు సంబంధించిన టాపిక్ ని(Topic) సైతం దరువు గా చదువుకుంటూ ఉండాలి. బోటనీ లో ఉన్న మూడు ఫ్యామిలీపై అవగాహన తెచ్చుకొని వాటిని బాగా చదువుకోవాలి. జువాలజీ చాలా పెద్ద సిలబస్ ఉంటుంది కానీ కష్టపడి చదివితే చాలా సులువుగా ఉంటుంది. ప్రోటో జావా, ఫొరిఫెరా, మెలస్కా, ఎకైనో డెర్మేటా, ప్లాటి హెల్మింథిస్..బాగా చవుకోవాలి. అమీబియా రూపంతారాలు బాగా చూసుకోవాలి.
CBI Internship: ఆ విద్యార్థులకు శుభవార్త.. స్పెషల్ ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేస్తున్న సీబీఐ.. వివరాలివే
ఫీజిక్స్ చాలా కష్టం అనుకోవద్దు..
ఆప్టిక్స్ వదిలి పెట్టి మిగిలిన అధ్యాయలు చదువుకోవాలి. సౌండ్.. సోనామిటర్ పై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఎలక్ట్రో కెమిస్ట్రీ., కైనాటిక్ కెమిస్ట్రీ చదువుకోవాలి. కార్బో హైడ్రేట్స్., ఫినాల్స్, ఆల్డిహైడ్., ఇథైల్ ఆల్కహాల్ చదువుకుంటే 16 మార్కులు రావడం ఖాయం. ఆర్గానిక్ కెమిస్ట్రీ బాగా చూసుకోవాలి. ఇతర ఈజీ టాపిక్స్ తరావుగా తదువుకోవాలి. ఒకటికి రెండు సార్లు రివిజన్ చేసుకుంటే మంచిది. స్కోరింగ్ ప్రకారం మనకు వచ్చిన ప్రశ్నలే కాకుండా వివిధ ప్రశ్నలు చదువుకోవాలి. ఒకే ప్రశ్నను మూడు రకాలుగా వచ్చే అవకాశం ఉంది. అందుకే సబ్జెక్టు అర్థం చేసుకుంటే ప్రశ్న సులువుగా తెలుసుకోవచ్చు. ఎంసెట్ ప్రిపేర్ అయ్యే రోజుల్లో మొబైల్, టీవీలకు దూరంగా ఉండండి. ఆ భూతాలకు అడిక్ట్ అయితే స్కోరింగ్ కోల్పోయినట్లే అని తిరుపతి జిల్లా ఎస్వీ జూనియర్ కాలేజీ లెక్చరర్ ప్రియవర్ధన బాబు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap eamcet, Career and Courses, JOBS, Students