ఏటా ఇంజినీరింగ్ కోసం ఎంసెట్ పరీక్ష (AP EAMCET Exam) రాయడానికి లక్షల్లో విద్యార్థులు పోటీ పడుతుంటారు. సీట్లు పెరుగుతున్నా పోటీ మాత్రం తగ్గడంలేదు. ఉన్నతమైన భవిష్యత్తుకు త్వరగా ఉద్యోగం సంపాదించడానికి ఇంజినీరింగ్ సులువైన మార్గం అందుకే తల్లిదండ్రుల్లోనూ ఇంజినీరింగ్ అంటే ఆసక్తి ఎక్కువే.
ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు ఇంజినీరింగ్ వంటి కోర్సులు చదవాలన్నా.. సాంప్రదాయిక డిగ్రీల్లో చేరి ఉన్నత విద్యలో రాణించాలన్నా.. రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో ఎన్నో యూనివర్సిటీలు పలు కోర్సుల ద్వారా అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇంటర్ తరువాత విద్యార్థుల ముందు రెండు మార్గాలున్నాయి. అవి ఉన్నత విద్య, ఉపాధి. ఈ రెండిట్లో ఏది అవసరమో ఎంచుకునేందుకు పలు రకాల పరిస్థితులు దోహదం చేస్తాయి.సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తిచేసిన వారిలో ఎక్కువ శాతం మంది చూపు ఇంజినీరింగ్ పైనే ఉంటుంది. అందుకే ఏటా ఇంజినీరింగ్‌కు ఎంసెట్‌కు లక్షల్లో విద్యార్థులు పోటీ పడుతుంటారు. సీట్లు పెరుగుతున్నా పోటీ మాత్రం తగ్గడంలేదు. ఉన్నతమైన భవిష్యత్తుకు త్వరగా ఉద్యోగం సంపాదించడానికి ఇంజినీరింగ్ సులువైన మార్గం అందుకే తల్లిదండ్రుల్లోనూ ఇంజినీరింగ్ అంటే ఆసక్తి ఎక్కువే. అందుకే ఎంసెట్ లో మంచి రాంక్ సాధించాలంటే మాత్రం ఈ పద్ధతిని పాటించండి.ఎంసెట్ ఎగ్జామ్స్ కు టైం దగ్గర గా ఉంది కాబట్టి ప్రిపరేషన్ లో కొత్త టాపిక్ల జోలికి వెళ్లకుండా మీరు నేర్చుకున్న దానిలో పరిపూర్ణత సాధించండి.
ఎక్కువ మాక్ టెస్ట్ లు వ్రాయండి కనీసం రోజు కు ఒకటి నుండి రెండు మాక్ టెస్ట్ లు వ్రాయాలి.ఆలా వ్రాయటం వాళ్ళ ఎక్సమ్ ను త్వరగా ఏలరాయలో అవగాహనా వస్తుంది. అంతే కాకుండా మీరు ఈ సబ్జెక్టు లో వీక్ గా ఉన్నారో తెలుసుకొని ఆ సబ్జెక్టు లో ఇంప్రూవ్ అవచు.కాన్సెప్టులను అవగాహన చేసుకొని మాక్ టెస్ట్ లు వ్రాయటం వలన సుమారు వంద మార్కులకు పైన సాధించవచ్చు.
ఇలా ఒక ప్రణాళిక ప్రకారం చదువుకుంటూ పోతే ఎంసెట్ ఓ మంచి రాంక్ సాధించవచ్చు.యూనిట్స్ అండ్ డైమన్షన్స్ ,హీట్ పార్ట్ ,మెకానికల్ ప్రాపర్టీ అఫ్ సాలీడ్స్ అండ్ లిక్యూడ్స్, మోడరన్ ఫిజిక్స్ ,కొలిజెన్సు సెంటర్ అఫ్ మాస్ వీటి నుండే ఎక్కువ తేలికయినా ప్రశ్నలు వస్తాయి వీటిలో కాన్సెప్ట్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి.ఈ పాటల నుండే ఫిజిక్స్ లో ఎజ్య్ గా పదమూడు నుండి పదిహేను మార్కులు పొందవచ్చు
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.