(P Bhanu Prasad, News18, Vizianagaram)
ఇంటర్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో టెక్నికల్ కోర్సుల్లో (Course) జాయిన్ కావాలనుకున్నవారి కోసం ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్ష ఎంసెట్ (EAMCET). రెండు తెలుగు రాష్ట్రాలలో జూలై నెలలో జరగనున్న ఎంసెట్ ఎగ్జామ్ కోసం, మంచి మార్కులు సాధించడం కోసం ఏఏ అంశాలు గమనించాలి. ఎలా చదవాలి? తదితర జాగ్రత్తలు (Exam Tips) పాటించడం అవసరం. ఎగ్జామ్ ఎలా రాస్తే మంచి మార్కులు గెయిన్ చేయగలం? తదితర వివరాలను ఈ స్టోరీ లో చూద్దాం. ఏటా ఇంజినీరింగ్ లో సీటు సాధించడం కోసం ఎంసెట్ పరీక్ష రాయడానికి లక్షల్లో విద్యార్థులు పోటీ పడుతుంటారు. సీట్లు పెరుగుతున్నా పోటీ మాత్రం తగ్గడంలేదు. ఉన్నతమైన భవిష్యత్ కు త్వరగా ఉద్యోగం సంపాధించడానికి ఇంజినీరింగ్ సులువైన మార్గం అందుకే తల్లిదండ్రుల్లోనూ ఇంజినీరింగ్ అంటే ఆసక్తి ఎక్కువే. ఈ ఏడాది ఇంటర్ మార్కుల వెయిటేజీ లేని కారణంగా పూర్తి ఎంట్రన్స్ టెస్ట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు నిర్ణయిస్తారు.
ఇక ఈ ఏడాది కూడా కోవిడ్ కారణంగా తగ్గించిన సిలబస్ నుంచే ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. కాబట్టి ఎంసెట్ కు కూడా అదే సిలబస్ నుండి వచ్చిన టాపిక్స్ ను చదివితే సరిపోతుంది. సిలబస్ లో లేని సబ్జెక్స్స్, టాపిక్స్ ను వదిలి పెట్టేయాలి. ఇందులో ముఖ్యంగా ఇంజనీరింగ్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ నుంచి తగ్గించిన సిలబస్ ను చూసుకొని, అందులో ఏ చాప్టర్ నుండి, ఏ టాపిక్స్ వస్తున్నాయో దాని ప్రకారం చదివితే.. తక్కువ ప్రిపేర్ అయ్యి ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది.
సబ్జెక్ట్ ల వారీగా ముఖ్యమైన చాప్టర్లను పరిశీలిద్దాం. 1)ఫిజిక్స్:ఇందులో మెకానిక్స్, ఫ్లూయిడ్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, వేవ్స్ అండ్ సౌండ్, కెపాసిటర్స్ & ఎలెక్ట్రోస్టాటిక్స్, మాగ్నెటిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆప్టిక్స్ అండ్ మోడరన్ ఫిజిక్స్ ప్రధానమైనవి. 2)కెమిస్ట్రీ: క్వాలిటేటివ్ అనాలిసిస్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ & కెమికల్ బాండింగ్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎలక్ట్రోకెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం ఇన్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఆల్డిహైడ్ & కీటోన్, ఆల్కైల్ & ఆర్గానిక్ కెమిస్ట్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్ ప్రధాన చాప్టర్లు. 3)మ్యాథమేటిక్స్: క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ & ఎక్స్ప్రెషన్స్, కాంప్లెక్స్ నంబర్స్, ప్రాబబిలిటీ, వెక్టర్స్ & 3D జ్యామితి, బీజగణితంలో మాత్రికలు; కోఆర్డినేట్ జ్యామితిలో సర్కిల్, పారాబోలా, హైపర్బోలా; విధులు, పరిమితులు, కొనసాగింపు, భేదం, ఉత్పన్నాల అప్లికేషన్లు ప్రధాన చాప్టర్లు. AP EAMCET 2022 Physics Preparation Tips: ఏపీ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఫిజిక్స్ ప్రిపరేషన్ టిప్స్ ఇవే.. తెలుసుకోండి
ఎంసెట్ లో మంచి మార్కులు సాధించాలంటే ఏం చేయాలి?
ఎంసెట్ లో మంచి మార్కులు సాధించాంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ప్రాట్రన్ ను అనుసరించి ప్రిపరేషన్ విషయంలో, పరీక్ష రాసే విధానంలో ప్రతీ విద్యార్ధి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
1) ఎంసెట్‌లో సిలబస్, ప్రశ్నల స్వరూపాన్ని పరిశీలిస్తే అడిగే ప్రశ్నలన్నీ ఇంటర్ సిలబస్‌లోని టాపిక్స్ ఆధారంగానే ఉంటున్నాయి. దీన్ని గుర్తించి అన్ని సబ్జెక్టుల్లోని కీలక అంశాలపై పట్టు సాధించాలి. అర్ధం చేసుకోవాలి.
2) టాపిక్స్ కు సంబంధించి ఫార్ములాలతో కూడిన షార్ట్ నోట్స్‌లు రివిజన్లో ఎంతో ఉపకరిస్తాయి.
3) పూర్తిగా ప్రాక్టికల్‌గా ఉండే మ్యాథమెటిక్స్, బొమ్మలు, చార్ట్‌ల రూపంలో ప్రాక్టీస్ చేయడం ద్వారా.. ఎగ్జామ్ రాసే సమయంలో ఎంతో మేలు చేస్తుంది. దీంతో మంచి మార్కులు సాధించవచ్చు. TS ICET 2022: తెలంగాణ ఐసెట్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నారా? అయితే.. ఈ విషయాలు మీ కోసమే.. తెలుసుకోండి
4) చదువుతున్న టాపిక్కు సంబంధించి సరైన సమాధానాలతో నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, అవి అవసరమైనప్పుడు రివిజన్ చేయడం వల్ల అసలు పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు.
5) మూడు సబ్జెక్టులను కవర్ చేసే విధంగా రోజువారీ స్టడీ షెడ్యూల్‌ను సిద్ధం చేసుకుని.. పక్కాగా ఫాలో కావాలి. ఏ సబ్జెక్ట్‌ను, ఏ అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
6) అన్నీ సబ్జెక్టులకు సమానంగా సమయాన్ని కేటాయించాలి. మొదట థియరీ భాగాన్ని కంప్లీట్ చేసి.. తర్వాత ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది. ఇలా చేయడం వల్ల కాన్సెప్ట్‌లను బాగా అర్థం చేసుకోవచ్చు.
7) టైమ్ మేనేజ్మెంట్, ప్రశ్నలను పరిష్కరించే వ్యూహంపైనే ఎంసెట్ లో ఎంత స్కోర్ చేస్తామనే అంశం ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం అంకితభావంతో ప్రిపేర్ కావడమే ఏకైక మార్గం.
8) ఎంసెట్ పరీక్షా సరళిని అర్థం చేసుకొని, ఆపై మంచి పుస్తకాలను ఎంచుకోవడం, పర్ఫెక్ట్ అయ్యే వరకు మాక్ టెస్ట్‌లు, ఎంసెట్ ఓల్డ్ పేపర్లను ప్రాక్టీస్ చేయండి.
9) ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లోని ప్రతీ సబ్జెక్టులోని టాపిక్ లను వేరు చేసి ఆపై చదవడం ప్రారంభించండి. సిలబస్‌లోని అంశాలను సులభమైనవి, కష్టమైనవిగా విభజించుకోండి. తద్వారా దానికనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగిస్తే విజయం తప్పక వరిస్తుంది.
10) ఎంసెట్ లో పరీక్ష రాసే సమయంలో మంచి ప్రారంభం ఉండేలా చూసుకోవాలి. అందుకోసం మీకు అనుకూలమైన సబ్జెక్ట్ ను, బాగా పట్టు ఉన్న సబ్జెక్ట్ తో పరీక్ష ప్రారంభిండం అవసరం.
11) కష్టతరమైన ప్రశ్నల దగ్గర ,ఎక్కువ సమయం వృథా చేయకుండా తర్వాత ఉన్న ప్రశ్నలు, సబ్జెక్ట్ ఎంచుకోవడం ఉత్తమం.
12)నెగెటివ్ మార్కులు లేని కారణంగా అన్నింటికీ సమాధానాలు రాయడం కంపల్సరీ అని గుర్తించాలి. వస్తే మార్కు వస్తుంది. లేకపోతే లేదు.
13) ఎంసెట్ ఆన్ లైన్ పరీక్షా విధానంలో ప్రశ్నలు స్క్రీన్ దాటి ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా ప్రశ్నను గుర్తుంచుకొని సమాధానం రాయగలగాలి.
14) పరీక్షలో కష్టమైన సబ్జెక్ట్ ప్రభావం మరొక సబ్జెక్ట పై పడకుండా చూసుకోవాలి.
15) ప్రిపరేషన్ టైం లోనే సబ్జెక్ట్ లోని అనుమానాలను నివ్ళత్తి చేసుకోవాలి. వేగం, ఖచ్చితత్వం పెరిగేలా మాక్ టెస్ట్ లు రాయడం , సమయ పాలన అవసరం.
16) పరీక్షలో అన్ని ప్రశ్నలను క్షుణ్ణంగా చదువు కోవడం చాలా ముఖ్యం. ప్రశ్నలోనే సరైన/సరికాని వాక్యాలను గుర్తించి సమాధానాన్ని ఎంచుకోవాలి.
17) ముఖ్యంగా పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందుగా చేరుకుని, పరీక్షా కేంద్రంలో రిలాక్స్ అవండి. అంతేగాని అదరాబదరాగా చివరి నిమిషంలో చేరుకున్నట్లయితే మీ మనసంతా గాబరా గాబరాగా తయారై పరీక్షమీద పూర్తి శ్రద్ధ పెట్టలేరు.
18) వీలైనన్ని మాక్ టెస్టులు రాయండి. దీనివల్ల మీకు ప్రశ్నపత్రం నమూనా తెలియడమే కాక ఎక్కడ మీరు వెనుకబడి ఉన్నారో తెలుస్తుంది. స్పీడ్ ప్రాక్టీస్‌కు కూడా అవకాశం కలుగుతుంది. చాలా వెబ్సైట్లు తక్కువ ధరకే మాక్‌టెస్ట్‌లు అందిస్తున్నాయి.
19) పరీక్షకు ముందు వారం రోజులు మీ తల్లిదండ్రులతో గడపడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇటువంటి పరీక్షలకు పాజిటివ్ ఎంకరేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ అవసరం. అంటే మీ చుట్టూ మిమ్మల్ని ప్రోత్సహించే వారితో గడిపితే, మీరు ఎక్కువగా ప్రిపేర్ అవడానికి అవకాశం ఉంటుంది.
20) మొదట ప్రశ్నపత్రం మొత్తం చదువుకుంటూ వెళ్లిపోండి. సులభమైన ప్రశ్నలకు సమాధానాలు వెంటనే రాయవచ్చు. ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలియనపుడు దానికోసం అప్పుడు ఆగవద్దు. దానివలన సమయం వృధా అవుతుంది.
21) మొదటి సారి ప్రశ్నలు చదువుతున్నప్పుడే కనీసం 40 శాతం ప్రశ్నలకు మీరు తేలికగా సమాధానం రాయగలుగుతారు. ఇవి అందరికి ఒకేరకంగా ఉంటాయి. అంటే అందరూ వీటికి సమాధానాలు రాయగలుగుతారు. రెండో సారి మరలా రాని ప్రశ్నలకు సమాధానాలు రాయటానికి ప్రయత్నించండి. దీనివల్ల 20 శాతం ప్రశ్నలకు సమాధానాలు రాయగలరు. ఈ ప్రశ్నలకు కూడా 40 శాతం మంది సమాధానాలు రాయగలరు. ఇక మిగిలిన 40 శాతం ప్రశ్నలు కష్టమైనవిగా ఉంటాయి. మీరు గట్టిగా కృషి చేస్తే వీటిలో కనీసం 10 శాతం సమాధానాలు రాయగలరు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.