హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP EAMCET 2020 Web Options: నేటి నుంచి ఏపీ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌... పుల్ డీటెయిల్స్

AP EAMCET 2020 Web Options: నేటి నుంచి ఏపీ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌... పుల్ డీటెయిల్స్

నేటి నుంచి ఏపీ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌... (ప్రతీకాత్మక చిత్రం)

నేటి నుంచి ఏపీ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌... (ప్రతీకాత్మక చిత్రం)

AP EAMCET 2020 Web Options: కరోనా కేసులు తగ్గుతున్న సమయంలో... ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కాబోతోంది. మరి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  AP EAMCET 2020 Web Options: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్‌ (ఎంపీసీ స్ట్రీమ్‌) కౌన్సెలింగ్‌ నేడు ప్రారంభం కానుంది. ఇదివరకు ప్రాసెసింగ్‌ ఫీజు, సర్టిఫికెట్ల పరిశీలనకు రాని విద్యార్థులకు డిసెంబర్ 28 నుంచి 31 వరకు ఛాన్స్ ఇచ్చారు. 29 నుంచి 31 వరకు విజయవాడ పాలిటెక్నిక్‌ కాలేజీ తప్ప మిగతా అన్ని కేంద్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలనకు రావచ్చు. దివ్యాంగులు, NCC, స్పోర్ట్స్ , మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలు 29న విజయవాడలోని పాలిటెక్నిక్‌ కాలేజీలో ఉన్న సహాయ కేంద్రంలో సర్టిఫికెట్ల పరిశీలనకు రావాలి. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 25 సహాయ కేంద్రాలు జనవరి 1 వరకు పనిచేస్తాయి. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు అక్టోబరు 23న తొలి నోటిఫికేషన్‌ ఇచ్చారు. అప్పుడు 85,702 మంది ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తైంది. అప్పుడు కౌన్సెలింగ్‌కు రాని వారికి ఇప్పుడు ఛాన్స్ ఇచ్చారు.

  కోర్సులు ఎలా ఎంచుకోవాలంటే:

  ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి, సర్టిఫికెట్లు చెక్ చేయించుకున్న విద్యార్థులు సోమవారం నుంచి కాలేజీలు, కోర్సుల ఎంపికకు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. జనవరి 1న కొత్తగా ఆప్షన్ల నమోదు, మార్పులకు ఛాన్స్ ఉంది. 3న సీట్ల కేటాయింపు పూర్తవుతుంది. ఆ వివరాల్ని అదే రోజు సాయంత్రం 6 గంటలకు వెబ్‌సైట్‌లో ఉంచుతారు. విద్యార్థులు ఫోన్‌ నంబరు, లాగిన్‌ ఐడీ, రిజిస్ట్రేషన్‌ నంబర్లలో మార్పులు చేసుకోవాలంటే సహాయ కేంద్రాలకు వెళ్లాలి. ఏమైనా డౌట్స్ ఉంటే 81065 75234, 81068 76345, 79956 81678 79958 65456, నంబర్లకు కాల్ చేసి క్లారిటీ తీసుకోవచ్చు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ https://apeamcet.nic.in లోకి వెళ్లి చూడొచ్చు.

  షెడ్యూల్‌ ఇదీ: కౌన్సెలింగ్ షెడ్యూల్ ఈ విధంగా ఉంది.

  డిసెంబర్‌ 28-29: 1 నుంచి 60,000 ర్యాంక్ వరకు.

  డిసెంబర్‌ 30-31: 60,001 నుంచి- చివరి ర్యాంకు వరకు కౌన్సెలింగ్ ఉంది.

  కన్వీనర్‌ కోటాలో సీట్ల వివరాలు:

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 257 ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో మొత్తం 1,29,016 సీట్లున్నాయి. వాటిలో కన్వీనర్‌ కోటావి 91,875, మేనేజ్‌మెంట్ కోటా సీట్లు 37,141 ఉన్నాయి. వాటితోపాటూ EWS కోటాలో 10 శాతం సీట్లు ఉన్నాయి. 120 బీఫార్మసీ కాలేజీల్లో 10,675 సీట్లు ఉన్నాయి. యూనివర్సిటీ కాలేజీల్లో 5,212 సీట్లు ఉన్నాయి. యూనివర్శిటీల్లో 9 బీఫార్మసీ కాలేజీల్లో 520 సీట్లు ఉన్నాయి.

  వ్యవసాయ, ఉద్యాన కోర్సుల ఎంపిక నేడే:

  ఆంధ్రప్రదేశ్ ఎంసెట్‌ రాసి... బైపీసీ, ఎంపీసీ స్ట్రీమ్‌ కోర్సుల్లో చేరేందుకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్నవారు యూజీ కోర్సులు, కాలేజీలను ఎంచుకోవడానికి డిసెంబర్ 28 నుంచి 30 వరకు ఛాన్స్ ఇచ్చారు.

  ఇది కూడా చదవండి:Horoscope Today: డిసెంబర్ 28 రాశి ఫలాలు... ఈ రాశుల వారికి ధన లాభ సంకేతాలు

  వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన యూనివర్శిటీల పరిధిలోని కోర్సులు, కాలేజీల వివరాల కోసం www.angrau.ac.in వెబ్‌సైట్‌లోని యూజీ అడ్మిషన్స్‌ పోర్టల్‌లో 30న అర్ధరాత్రి వరకు ఆప్షన్లు ఎంచుకోవచ్చు. కోర్సులతో పాటు ఫీజులు, సీట్ల కేటాయింపు వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయి.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: AP EAMCET 2020, AP News, EDUCATION

  ఉత్తమ కథలు