AP EAMCET 2020 SECOND PHASE COUNSELLING OPTION ENTRY STARTS FROM JANUARY 21 NS
ఆ కోర్సుల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులకు అలర్ట్.. ఈ రోజు నుంచే వెబ్ ఆప్షన్ల నమోదు.. పూర్తి వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
AP EAMCET 2020 Counselling: కరోనా ఎఫెక్ట్ తో అనేక పరీక్షలు, ప్రవేశాలు చాలా ఆలస్యమయ్యాయి. కొన్ని పరీక్షలను ప్రభుత్వాలు రద్దు చేశాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విద్యా సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా కావొద్దన్న లక్ష్యంతో ప్రభుత్వాలు పని చేస్తున్నాయి.
కరోనా దెబ్బకు ఈ సారి విద్యా సంవత్సరం అంతా గందరగోళంగా సాగుతోంది. అనేక పరీక్షలు, ప్రవేశాలు చాలా ఆలస్యమయ్యాయి. కొన్ని పరీక్షలను ప్రభుత్వాలు రద్దు చేశాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విద్యా సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా కావొద్దన్న లక్ష్యంతో ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. దీంతో పరీక్షల షెడ్యూల్ ప్రకటించడంలో, అడ్మిషన్లు నిర్వహించడంలో వేగం పెంచాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(APSCHE) తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసెట్ ఇంజనీరింగ్ రెండో దశ అడ్మిషన్ల ప్రక్రియను జనవరి 21(ఈ రోజు) నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఎంసెట్ లో ర్యాంకు సాధించిన అభ్యర్థులు ఈనెల 21 నుంచి 23 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం ఈనెల 25న సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఇతర వివరాలకు https://apeamcet.nic.in/ వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఆ సమయంలో మిగిలిపోయిన సీట్లను ఈ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ లో భర్తీ చేయనున్నారు. ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొంది.. ఇప్పటి వరకు రిపోర్ట్ చేయని అభ్యర్థుల సీట్లను సైతం తాజా కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల ఏపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలోని ఇంటర్మీడియట్ కాలేజీలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా పదో తరగతి విద్యార్థులకు నేటి నుంచి రెండు పూటలా తరగతులు జరగనున్నాయి. వీరికోసం ప్రత్యేంగా 103 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. 10వ తరగతి విద్యార్థులకు రోజుకు 8 పీరియడ్లు నిర్వహిస్తారు. ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4.20గంటల వరకూ తరగతులు జరుగుతాయి. జాతీయ, ఇతర పండుగలు మినహా ఆదివారాల్లో కూడా తరగతులు నిర్వహిస్తారు. ఆదివారం ఒక పూట ఒక సబ్జెక్టులో మాత్రమే తరగతులు జరుగుతాయి. అన్ని పాఠశాలల్లో సోమవారం నుంచి ఈ ప్రణాళికను అమలు చేయాలని డీఈవో సుబ్బారావు ఆదేశించారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.