ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ 2020 అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయి. సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్ష కోసం 2,72,720 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. సాధారణంగా అయితే ఈపాటికి ఎంసెట్ పరీక్షతో పాటు కౌన్సిలింగ్ కూడా పూర్తయ్యేది. కానీ... కరోనా వైరస్ సంక్షోభం కారణంగా పరీక్ష వాయిదా పడింది. లాక్డౌన్ ఆంక్షల్ని సడలించడంతో పరీక్ష నిర్వహిస్తోంది జేఎన్టీయూ కాకినాడ. అడ్మిట్ కార్డులు అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. https://sche.ap.gov.in/ వెబ్సైట్లో అడ్మిట్ కార్డ్స్ ఉన్నాయి. డౌన్లోడ్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.
IBPS Clerk 2020: బ్యాంకు ఉద్యోగం మీ కలా? 1557 క్లర్క్ పోస్టులకు అప్లై చేయండి ఇలా
Work From Home Jobs: మీకు ఈ 6 స్కిల్స్ ఉన్నాయా? ఇంటి నుంచే జాబ్ చేయొచ్చు
విద్యార్థులు ముందుగా https://sche.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో AP EAMCET 2020 ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో Download HallTicket లింక్ పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
వివరాలన్నీ సరిగ్గా ఎంటర్ చేసిన తర్వాత Download Hallticket పైన క్లిక్ చేస్తే అడ్మిట్ కార్డ్ డిస్ప్లే అవుతుంది.
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.
విద్యార్థులు పరీక్షకు వెళ్లే ముందే హాల్ టికెట్లోని ఇన్స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి.
ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ 2020 షెడ్యూల్ చూస్తే ఇంజనీరింగ్ స్ట్రీమింగ్ విద్యార్థులకు సెప్టెంబర్ 17, 18, 21, 22, 23 తేదీల్లో, అగ్రికల్చర్ విద్యార్థులకు సెప్టెంబర్ 23, 24, 25 తేదీల్లో పరీక్ష జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ ఎగ్జామ్ ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP EAMCET 2020, AP News, Exams, Telugu news, Telugu updates, Telugu varthalu