AP EAMCET 2019 : కాసేపట్లో ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ రిలీజ్... ఇలా చెక్ చేసుకోండి..

AP EAMCET Results | కొన్నిగంటల్లో ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ రిలీజ్ కానున్నాయి. మే 1 మధ్యాహ్నం 3గంటలకు ఏపీ ఎంసెట్ రిజల్ట్స్‌ని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

news18-telugu
Updated: May 1, 2019, 12:36 PM IST
AP EAMCET 2019 : కాసేపట్లో ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ రిలీజ్... ఇలా చెక్ చేసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీ ఎంసెట్ 2019 పరీక్షల ఫలితాలు మధ్యాహ్నం 3గంటలకు విడుదల కానున్నాయి. జేఎన్‌టీయూ కాకినాడ ఈ ఫలితాలను విడుదల చేయనుంది. అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ సబ్‌మిట్ చేసి రిజల్ట్స్ చూసుకోవచ్చు. ఏప్రిల్ 20 నుంచి 24 వరకు ఏపీఎంసెట్‌ని నిర్వహించారు అధికారులు. రెండు సెషన్లలో పరీక్షలు జరిగాయి.

ఈ ఏడాది మొత్తం 2,82,633 మంది అభ్యర్థులు ఎంసెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో ఇంజినీరింగ్ పరీక్షలకు 1,85,711 మంది, అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు పరీక్షలకు 81,916 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇంజనీరింగ్ ప్రాథమిక కీని ఏప్రిల్ 24న, అగ్రికల్చర్, మెడికల్ ప్రాథమిక కీని ఏప్రిల్ 25న విడుదల చేశారు.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

* ముందుగా అఫిషియల్ వెబ్‌సైట్ అంటే పైన లింక్‌పై క్లిక్ చేయండి..


* ఇప్పుడు ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్‌టికెట్ నెంబర్ submit చేయండి..
* వెంటనే స్క్రీన్‌పై రిజల్ట్స్ వస్తాయి..
First published: May 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు