AP EAMCET 2019 : ఈ నెల 17 లేదా 18న విడుదల కానున్న ఎంసెట్ రిజల్ట్స్

AP EAMCET 2019 | ఏపీ ఎంసెట్ 2019 పరీక్షల ఫలితాలు ఈ నెల 17 లేదా 18 న విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జేఎన్‌టీయూ కాకినాడ ఈ ఫలితాలను విడుదల చేయనుంది. అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

news18-telugu
Updated: May 13, 2019, 1:07 PM IST
AP EAMCET 2019 : ఈ నెల 17 లేదా 18న విడుదల కానున్న ఎంసెట్ రిజల్ట్స్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 13, 2019, 1:07 PM IST
ఏపీ ఎంసెట్ 2019 పరీక్షల ఫలితాలు ఈ నెల 17 లేదా 18 న విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జేఎన్‌టీయూ కాకినాడ ఈ ఫలితాలను విడుదల చేయనుంది. అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ సబ్‌మిట్ చేసి రిజల్ట్స్ చూసుకోవచ్చు. ఏప్రిల్ 20 నుంచి 24 వరకు ఏపీఎంసెట్‌ని నిర్వహించారు అధికారులు. రెండు సెషన్లలో పరీక్షలు జరిగాయి.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
* ముందుగా అఫిషియల్ వెబ్‌సైట్ అంటే పైన లింక్‌పై క్లిక్ చేయండి..

* ఇప్పుడు ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్‌టికెట్ నెంబర్ submit చేయండి..
* వెంటనే స్క్రీన్‌పై రిజల్ట్స్ వస్తాయి..



అయితే, ముందుగా ఈ రిజల్ట్స్ మే 1న విడుదల చేయనున్నట్లు ప్రకటన చేశారు. కానీ, గ్రేడింగ్ విధానంలో ఇంటర్ ఫలితాలు రావడంతో ఎంసెట్‌కు వెయిటేజీ ఎలా ఇవ్వాలనే దానిపై సందిగ్ధత కొనసాగడంతో ఫలితాల ప్రకటనని ఆ రోజున వాయిదా వేశారు.

ఈ ఏడాది మొత్తం 2,82,633 మంది అభ్యర్థులు ఎంసెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో ఇంజినీరింగ్ పరీక్షలకు 1,85,711 మంది, అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు పరీక్షలకు 81,916 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇంజనీరింగ్ ప్రాథమిక కీని ఏప్రిల్ 24న, అగ్రికల్చర్, మెడికల్ ప్రాథమిక కీని ఏప్రిల్ 25న విడుదల చేశారు.
Loading...
ఇవి కూడా చదవండి..

AP SSC Results 2019 : రేపే ఏపీ పదో తరగతి ఫలితాలు..ఇలా చెక్ చేసుకోండి..
First published: May 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...