AP EAMCET 2019 : ఏపీ ఎంసెట్ హాల్‌టికెట్స్ రిలీజ్.. దరఖాస్తు చేసేందుకు అవకాశముంది..

AP EAMCET 2019 | ఎంసెట్ దరఖాస్తు గడువు ముగిసినా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.10,000 ఆలస్య రుసుముతో రూ. 10,000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 19 వరకూ అప్లై చేసుకోవచ్చు.

news18-telugu
Updated: April 16, 2019, 11:39 AM IST
AP EAMCET 2019 : ఏపీ ఎంసెట్ హాల్‌టికెట్స్ రిలీజ్.. దరఖాస్తు చేసేందుకు అవకాశముంది..
నీట్ ఎగ్జామ్‌లో టాపర్స్ వీరే
  • Share this:
ఆంధ్రప్రదే‌శ్‌లో నిర్వహించే ‘ఎంసెట్’ ఎగ్జామ్‌కి సంబంధించిన హాల్‌టికెట్లు ఏప్రిల్ 16నుంచి అందుబాటులో ఉండనున్నాయి. ‘ఏపీ ఎంసెట్2019’కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష సమయం వరకు ఎంసెట్ హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు గడువు ముగిసినప్పటికీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అకాశం ఉంది. రూ.10,000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓట్ల లెక్కింపు కేంద్రాలు పలు జిల్లాల్లో ఇంజినీరింగ్ కాలేజీల్లో ఏర్పాటు చేయడంతో సుమారు 10వేల మంది విద్యార్థులకు వారు ఎంచుకున్న 3 ఎగ్జామ్ సెంటర్స్ కాకుండా సమీపంలోని మరో కేంద్రాన్ని కేటాయించారు. ఇలా కేంద్రాలు మార్చిన విద్యార్థులకి మధ్యాహ్న సెషన్‌‌లో పరీక్ష రాసే అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా విద్యార్థులకు ఎగ్జామ్ సెంటర్స్ వెతికేందుకు సాయంగా.. హాల్ టికెట్ వెనుక భాగంలో పరీక్ష కేంద్రం రూట్ మ్యాప్ కూడా ఉంటుంది. తెలంగాణలో పరీక్ష రాసే వారికి హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, నాచారం, సికింద్రాబాద్‌లలో సెంటర్స్‌ని కేటాయించారు.

ఏపీ ఎంసెట్ 2019కి దరఖాస్తులు భారీగా వచ్చాయి. ఇప్పటివరకూ దాదాపు 2.83 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగానికి 1.96 లక్షల మంది, మెడికల్‌కి 87వేల మంది అప్లికేషన్‌లు సమర్పించారు. ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్ష 7 సెషన్లుగా.. అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్ష 3 సెషన్లలో జరుగనుంది.

* ఇంజనీరింగ్ పరీక్ష ఈ నెల 20, 21, 22 తేదీల్లో 2 విడతలుగా, 23న ఉదయం ఒక విడతగా నిర్వహిస్తారు.
* వ్యవసాయ, వైద్య విభాగ పరీక్షలు 23 మధ్యాహ్నం, 24న 2 విడతలుగా నిర్వహిస్తారు.

అదేవిధంగా.. పరీక్ష రాసే విద్యార్థులకు అధికారులు కొన్ని సూచనలు చేస్తున్నారు అధికారులు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని, పరీక్ష హాలులోకి కాలిిక్యులేటర్లు, సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబోమని సెట్ కన్వీనర్ సాయిబాబా తెలిపారు.

ఇవి కూడా చదవండి...

Scholarship : ఇంటర్‌ తర్వాత స్కాలర్‌షిప్.. ఇలా అప్లై చేయండి..Govt Jobs : కేంద్ర సాయుధ బలగాల్లో 496 ఉద్యోగాలు..
First published: April 16, 2019, 11:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading