ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (SLPRB AP) నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ప్రిలిమినరీ రాత పరీక్ష కోసం జనవరి 12న ఈ బోర్డ్ అడ్మిట్ కార్డ్‌లను జారీ చేయనుంది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ slprb.ap.gov.in నుంచి అడ్మిట్‌కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫారమ్‌లో ఏవైనా ఎర్రర్స్ ఉంటే, కరెక్షన్ చేయడానికి బోర్డ్ ఒక విండోను కూడా ఓపెన్ చేసింది.
* ప్రిలిమినరీ రాత పరీక్ష వివరాలు
పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ప్రిలిమినరీ రాత పరీక్ష జనవరి 21న ఉదయం 10 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుంది. ఈ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులను జనవరి 9న విడుదల చేస్తామని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తు గడువును పొడిగించడంతో ఆడ్మిట్ కార్డ్ జారీని వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తంగా 6,100 ఓపెన్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* మూడు లాంగ్వేజ్‌లో రాత పరీక్ష
ప్రిలిమినరీ రాత పరీక్షలో 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించనున్నారు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. ప్రశ్నపత్రం మూడు లాంగ్వేజ్‌లు ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటుంది. ప్రిలిమినరీ రాత పరీక్షలో సాధించిన మార్కులు తదుపరి ప్రాసెస్‌కు కేవలం అర్హత ప్రమాణం మాత్రమే. ఫైనల్ సెలక్షన్‌కు ఈ మార్కులు ఎంటువంటి సంబంధం ఉండదు.
* అడ్మిట్‌కార్డ్ డౌన్‌లోడ్ విధానం
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (SLPRB AP) అధికారిక వెబ్‌సైట్ slprb.ap.gov.inను సందర్శించాల్సి ఉంటుంది.
ఆ తరువాత హోమ్ పేజీలో రిక్రూట్‌మెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆపైన SCT PC (Civil) (Male & Female), SCT PC (APSP) అడ్మిట్ కార్డ్ కోసం అందుబాటులో ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.
పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు, ఎంపిక ప్రక్రియలో భాగంగా తరువాత ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎమ్‌టీ) లేదా ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ) క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఈ టెస్ట్‌లకు సంబంధించిన వేదిక, డేట్, టైమ్ వంటి వివరాలతో కూడిన ఇంటిమేషన్ లెటర్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, AP SLPRB 400 సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Admit card, Andhra Pradesh, AP Police, Exams, JOBS, Police jobs