Home /News /jobs /

AP CM JAGAN TOMORROW VISITS EASTGODAVARI DISTRICT P GANNAVARAM TO STARS 2ND PHASE NADU NEDU SCHEME NGS

CM Jagan Visits East Godavari: రేపు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. నాడు-నేడు రెండో విడతకు శ్రీకారం

సీఎం జగన్ (File)

సీఎం జగన్ (File)

ఏపీ సీఎం జగన్ రేపు తూర్పు గోదవరి జిల్లాలో పర్యటించనున్నారు. నాడు-నేడు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు.. జగనన్న విద్యా కానుకను విద్యార్థులకు అందజేయనున్నారు.

  గత కొంతకాలంగా సీఎం క్యాంపు కార్యాలయం, ఇంటికే పరిమితమైన సీఎం జగన్ ఇప్పుడు రూటు మార్చారు. జనం బాట పట్టారు. ఇకపై జనంలోనే ఉండాలని నిర్ణయించారు. వరుస కార్యక్రమాలకు హాజరవుతున్నారు. రేపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రెండో విడత నాడు-నేడు పనులకు సీఎం జగన్ శ్రీకారం చుడతారు. పి.గన్నవరం మండలం పోతవరం జడ్పీ హైస్కూల్‌లో నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జగనన్న విద్యాకానుక కింద పిల్లలకు సీఎం జగన్ కిట్లు పంపిణీ చేయనున్నారు. స్థానిక జెడ్పీ హైస్కూలులో జరగనున్నసీఎం జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పనులను మంత్రులు ఆదిమూలపు సురేష్, పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, కలెక్టర్‌ సి.హరికిరణ్ ఇతర అధికారులు పరిశీలించారు. ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అన్నదానిపై అధికారులకు మంత్రులు పలు సూచనలిచ్చారు. అక్కడి తరగతి గదులు, ఫర్నిచర్, పెయింటింగ్స్, మరుగుదొడ్లను, ‘నాడు–నేడు’ పైలాన్‌ను అధికారులతో కలిసి మంత్రులు పరిశీలించారు. సభకు హాజరయ్యే విద్యార్థులకు సరిపడేలా చిన్న సైజు మాస్కులు ఇవ్వాలని కలెక్టర్‌ చెప్పారు.

  నాడు–నేడులో భాగంగా 10 రకాల మౌలిక సదుపాయాలు బాగా ఏర్పాటు చేశారని మంత్రి సురేష్‌ ప్రశంసించారు. శుక్రవారం అర్ధరాత్రి, శనివారం సాయంత్రం కురిసిన వర్షాలు అడ్డంకిగా మారినప్పటికీ పనులు ముమ్మరంగా చేపట్టడంపై అధికారులను అభినందించారు. పాఠశాల ఆవరణలో భారీ వాటర్‌ ప్రూఫ్‌ షెడ్డును నిర్మించారు. షెడ్డు పరిసరాల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా మోటార్లు ఏర్పాటు చేసి తోడుతున్నారు. వర్షాలకు పాఠశాల ఆవరణ చిత్తడిగా మారింది. పాఠశాల ముఖద్వారం వద్ద నేమ్‌ బోర్డు ఏర్పాటు చేశారు.

  ఇదీ చదవండి: సీఎం జగన్ కు గుడి కట్టిన ఎమ్మెల్యే.. ఖర్చు ఎంతంటే..? ఎక్కడో తెలుసా?

  సీఎం జగన్ వస్తుండడంతో ప్రత్యేక ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు మంత్రులు. సీఎం జగన్ ప్రారంభించనున్న పాఠశాల మెయిన్ గేట్ నుంచి హెలిప్యాడ్‌ వరకూ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాలల ప్రారంభంపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు 80 శాతం స్కూళ్లను పూర్తిగా ఆధునీకరించారు. కరోనా, లాక్ డౌన్ సమయంలో సైతం ముమ్మరంగా పనులు చేసి.. స్కూళ్లకు కొత్త హంగులు అద్దారు. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా మార్చారని అధికారులు చెబుతున్నారు. మరి వాస్తవం ఏంటన్నది రేపు అందరికీ తెలియనుంది..
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, East Godavari Dist

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు