ఏపీలోని నర్సింగ్ కాలేజీల్లో 426 టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి గ్రీన్ సిగ్నల్...

ఆంధ్రపదేశ్‌లోని పలు నర్సింగ్ కాలేజీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

news18-telugu
Updated: June 11, 2020, 4:49 PM IST
ఏపీలోని నర్సింగ్ కాలేజీల్లో 426 టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి గ్రీన్ సిగ్నల్...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆంధ్రపదేశ్‌లోని పలు నర్సింగ్ కాలేజీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోజు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నర్సింగ్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీపై చర్చించారు. మచిలీపట్నం, గుంటూరు, శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు, తిరుపతిలో 2014కు ముందు చంద్రబాబు హయాంలో నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశారు. అయితే, అక్కడ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీ విషయంలో టీడీపీ ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం దీనిపై చర్చించి అక్కడ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీ చేయాలని నిర్ణయించిందని చెప్పారు. ఈ మేరకు మచిలీపట్నం, గుంటూరు, శ్రీకాకుళం నర్సింగ్ కాలేజీల్లో 282 టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీల భర్తీ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, ఏలూరు, ఒంగోలు, తిరుపతిల్లోని నర్సింగ్ కాలేజీల్లో 144 టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీ చేయాలని ప్రభుత్వం అనుమతులు జారీ చేసినట్టు మంత్రి పేర్ని నాని చెప్పారు. మొత్తంగా 426 పోస్టుల భర్తీ చేయనున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: June 11, 2020, 4:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading