హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Anganwadi Jobs: ఏపీలో అంగన్ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ప్రాంతాల వారీగా ఖాళీల వివరాలివే..

AP Anganwadi Jobs: ఏపీలో అంగన్ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ప్రాంతాల వారీగా ఖాళీల వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీ ఉద్యోగాల (AP Anganwadi Jobs) భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. కడప జిల్లాలో 71, విజయనగరం జిల్లాలో 78 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీ ఉద్యోగాల (AP Anganwadi Jobs) భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. కడప జిల్లాలో 71, విజయనగరం జిల్లాలో 78 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. పోస్టుల ఆధారంగా టెన్త్, ఆ లోపు విద్యార్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కడప జిల్లాలో..

S.Noవిభాగంఖాళీలు
1.అంగన్ వాడీ వర్కర్18 పోస్టులు
2.అంగన్ వాడీ హెల్పర్:49 పోస్టులు
3.అంగన్ వాడీ వర్కర్:04 పోస్టులు

ఈ ఖాళీలు కడప(యు), కడప(ఆర్), కమలాపురం, జమ్మలమడుగు, ముద్దనూరు, ప్రొద్దుటూరు, మైదుకూరు, చాపాడు, పులివెందుల, బద్వేల్,బి.కోడూరు, బి.మఠం, పోరుమామిళ్ల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హతల వివరాలు: అంగన్ వాడీ వర్కర్ ఉద్యోగాలకు టెన్త్, మిగిలిన పోస్టులకు 7వ తరగతి పాసై ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. వయో పరిమితి: 01-07-2022 నాటికి 21-35 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తు చివరి తేదీ: మార్చి 27.

ఇంటర్వ్యూలు: మార్చి 28.

విజయనగరం జిల్లాలో..

S.No.పోస్టుఖాళీలు
1.అంగన్ వాడీ వర్కర్10
2.అంగన్ వాడీ హెల్పర్53
3.మినీ అంగన్ వాడీ వర్కర్15

జిల్లాలోని గంట్యాడ, భోగాపురం, రాజాం, వీరగట్టం, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం(యు), బొబ్బిలి, బాడంగి, గణపతినగరం, సాలూరు(ఆర్), ఎస్.కోట, వియ్యంపేట లో ఈ ఖాళీలు ఉన్నాయి.

వేతనం: అంగన్ వాడీ వర్కర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.11,500, మినీ అంగన్ వాడీ వర్కర్ కు రూ.7 వేలు, అంగన్ వాడీ హెల్పర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.7 వేల వేతనం ఉంటుంది.

- దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 29ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.

First published:

Tags: Andhra Pradesh Government Jobs, Anganwadi, JOBS