హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Anganwadi Jobs: ఏపీలో టెన్త్ అర్హత కలిగిన అభ్యర్థులకు గుడ్ న్యూస్.. అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలివే

AP Anganwadi Jobs: ఏపీలో టెన్త్ అర్హత కలిగిన అభ్యర్థులకు గుడ్ న్యూస్.. అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో కడప మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం నిరుద్యోగ మహిళలకు శుభవార్త చెప్పింది. తాత్కాలిక పద్ధతిలో అంగన్ వాడీ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Kadapa (Cuddapah), India

అంగన్ వాడీ ఉద్యోగాలు (Anganwadi Jobs) అంటే గ్రామాల్లో మంచి క్రేజ్ ఉంటుంది. ఉన్న ఊరిలోనే ఉద్యోగం చేసే అవకాశం ఉన్న ఈ నియామకాల కోసం మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇలాంటి మహిళలకు శుభవార్త చెప్పింది ఏపీలో కడప మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం. తాత్కాలిక పద్ధతిలో అంగన్ వాడీ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఖాళీల వివరాలు:

అంగన్ వాడీ వర్కర్ విభాగంలో మొత్తం 37 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా అంగన్ వాడీ హెల్పర్ విభాగంలో 108, అంగన్ వాడీ మినీ వర్కర్ విభాగంలో మరో 3 ఖాళీలు ఉన్నాయి. 7వ తరగతి పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. జులై 1 నాటికి 21 నుంచి 35 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తులు:

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో తీసుకోవాలి. ఆ దరఖాస్తులను పూర్తిగా నింపి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 11ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 12న నిర్వహించనున్న ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలను సంబంధిత ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహిస్తారు.

First published:

Tags: Andhra Pradesh Government Jobs, Anganwadi, JOBS, Kadapa, State Government Jobs

ఉత్తమ కథలు