హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP,TS GDS Results: తెలంగాణ, ఏపీ జీడీఎస్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

AP,TS GDS Results: తెలంగాణ, ఏపీ జీడీఎస్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారత తపాలా శాఖ-గ్రామీణ డాక్ సేవల్ (GDS) నియామకాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్స్ కు సంబంధించిన ఏడో జాబితా విడుదలైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Telangana

భారత తపాలా శాఖ-గ్రామీణ డాక్ సేవల్ (GDS) నియామకాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్స్ కు సంబంధించిన ఏడో జాబితా విడుదలైంది. ఈ జాబితాను పోస్టల్ అధికారులు నిన్న అంటే.. ఈ నెల 10న విడుదల చేశారు. అభ్యర్థులు ఈ లింక్ https://indiapostgdsonline.gov.in/ ద్వారా తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. టెన్త్ లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక నిర్వహించారు. ఏపీ సర్కిల్‌లో 326 మంది అభ్యర్థులు, తెలంగాణ సర్కిల్‌లో 162 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామీణ తపాలా కార్యాలయాల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సంబంధించి తపాలా శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. జీడీఎస్ నియామక ప్రక్రియలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన వారి జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులు నవంబర్ 24 లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొంది తపాలా శాఖ.

షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ కోసం స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీసులో నవంబరు 24 లోపు సంప్రదించాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ కోసం ఎంపికైన అభ్యర్థులకు SMS లేదా ఈమెయిల్ ద్వారా అధికారులు సమచారాన్ని అందించనున్నారు. గడువు దాటాక తర్వాత ధ్రువపత్రాల పరిశీలనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనమతించేది లేదని అధికారులు చెబుతున్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను, ఒక జత జిరాక్స్ కాపీలను, ఫోటోలను వెంట తీసుకుని వెళ్లాలని సూచించారు.

UIDAI Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. యూఐడీఏఐలో జాబ్స్ .. ఖాళీలు, విద్యార్హతల వివరాలివే

అభ్యర్థులు తమ రిజల్ట్స్ ను ఇలా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది..

Step 1: మొదటగా అధికారిక వెబ్ సైట్ https://indiapostgdsonline.gov.in/ ను ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం షార్ట్ లిస్టెడ్ క్యాండిడెడేట్స్ (Short Listed Candidates) ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 3: అక్కడ మనం కావాల్సిన సర్కిల్ ను ఎంచుకోవాలి.

Step 4: అనంతరం ఎంపికైన అభ్యర్థుల జాబితా కలిగిన పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.

Step 5: ఆ పీడీఎఫ్ లో మీ పేరు ఉందో చెక్ చేసుకోవాలి.

First published:

Tags: Central Government Jobs, JOBS, Post office jobs

ఉత్తమ కథలు