Home /News /jobs /

AP 10TH RESULTS TOMORROWS AP RESULTS RELEASE TIME CHECK AT BSE AP GOV IN KNOW DETAILS EVK

AP SSC Results 2022 Date & Time: రేపే ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు, ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి.

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Andhra Pradesh SSC Results 2022 | పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE AP) AP SSC ఫలితాలను రేపు విడుదల చేస్తున్నట్టు సమచారం. అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in లో జూన్ 4 ఉదయం 11 గంటలకు ఫ‌లితాలు అందులో బాటులో ఉండ‌నున్నాయి.

ఇంకా చదవండి ...
    sAP 10th Exams Resutls  | పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE AP) AP SSC ఫలితాలను రేపు విడుదల చేస్తున్నట్టు సమచారం. అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in లో జూన్ 4 ఉదయం 11 గంటలకు ఫ‌లితాలు అందులో బాటులో ఉండ‌నున్నాయి. ఏపీలో పదో తరగతి పరీక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3,776 పరీక్ష కేంద్రాల్లో ప‌రీక్ష నిర్వ‌హించారు. మొత్తం 6 లక్షల 2 1వేల 799 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలికలు 3 లక్షల 2 వేల 474 మంది, 3 లక్షల 63 మంది బాలురు ఉన్నారు. ఈసారి మార్కుల రూపంలో ఫలితాలను విద్యాశాఖ ప్రకటించనుంది. రికార్డు స్థాయిలో 25 రోజుల్లోనే విద్యాశాఖ ఫలితాలు ప్రకటించనుంది. ఏప్రిల్‌ 27న ప్రారంభమైన టెన్త్‌ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి.

    Job News: ఆ రంగాల్లోనే ఎక్కువ ఉద్యోగాలు.. క‌రోనా త‌రువాత మారిన ప‌రిస్థితి

    BSE AP 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 27 నుండి మే 9, 2022 వరకు జరిగాయి. ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఏప్రిల్ 27-తెలుగు, ఏప్రిల్-28-సెకండ్ లాంగ్వేజ్, ఏప్రిల్ 29-ఇంగ్లిష్, మే 2-గణితం, మే 4-సైన్స్-4, మే 5-సైన్స్ పేపర్-2, మే 6న సోషల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్ 50 మార్కుల చొప్పున.. మిగతా అన్ని పరీక్షలు 100 మార్కులకు నిర్వహించారు.

    గతంలో టెన్త్ పరీక్షల్లో గ్రేడింగ్ విధానంలో ఫలితాలను ప్రకటించేవారు. 2020 నుంచి గ్రేడ్లకు బదులు విద్యార్థులకు మార్కులు ఇస్తున్నారు.

    Job News: డిగ్రీ చేసి డ్రైవర్ ఉద్యోగం.. పీజీ చదివి కానిస్టేబుల్.. పోలీస్ జాబ్స్ ద‌ర‌ఖాస్తుల్లో ఆస‌క్తిక అంశాలు

    ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు, ట్యుటోరియల్ విద్యాసంస్థలు విద్యార్థులకు ర్యాంకులను ఆపాదిస్తూ తమ సంస్థకే ఉత్తమ ర్యాంకులు, అత్యధిక ర్యాంకులు వచ్చాయింటూ ప్రకటనలు ఇస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుంది.

    ఫ‌లితాలు ఎలా చెక్ చేసుకోవాలి..

    ప‌దోత‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను జూన్ 4, 2022 తేదీ నుంచి ఉదయం 11 గంట‌ల స‌మ‌యంలో అధికారిక వెబ్‌సైట్‌ bse.ap.gov.in లో అందుబాటులో ఉంటాయి. ఈ నేప‌థ్యంలో విద్యార్థులు త‌మ హాల్‌టికెట్ నంబ‌ర్‌తో ఫలితాలు తెలుసుకోవాలి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: 10th class results, AP 10th Exams 2022, AP ssc results, SSC results

    తదుపరి వార్తలు