AP 10TH RESULTS ANDHRA PRADESH SSC RESULTS ARE POSTPONED TO MONDAY HERE IS MORE DETAILS SK
AP SSC 10th results 2022 postponed: ఏపీ పదో తరగతి ఫలితాల ప్రకటన వాయిదా.. ఆ రోజే విడుదల
(ప్రతీకాత్మక చిత్రం)
AP SSC Results: టెన్త్ రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా? అని ఆతురతగా ఎదురుచూసిన విద్యార్థులు, తల్లిదండ్రులకు నిరాశే ఎదురయింది. పదో తరగతి ఫలితాల ప్రకటన చివరి నిమిషంలో వాయిదా పడింది. మరి ఎప్పుడు ప్రకటిస్తారు? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఏపీ పదో తరగతి ఫలితాల ప్రకటన (AP 10th Exams Results) వాయిదా పడింది. ఇవాళ ఉదయం 11 గంటలకు విడుదల చేయాల్సి ఉండగా.. సాంకేతిక సమస్యలతో వాయిదా వేశారు. సోమవారం నాడు ఫలితాలను ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వెల్లడించింది. ఇవాళే పదో తరగతి ఫలితాలు (Andhra Pradesh SSC Results) వస్తాయని.. లక్షాలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురు చూశారు. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో వాయిదా వేశారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అందుబాటులో లేకపోవడం వల్లే ఫలితాలు వాయిదా పడ్డాయని తెలుస్తోంది. సాధారణంగా పరీక్షా ఫలితాల (Andhra Pradesh 10th exams results date)ను విద్యాశాఖ మంత్రే విడుదల చేస్తుంటారు. ఎప్పటి నుంచో ఇది ఆనవాయితీగా వస్తోంది. కానీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Sathyanarayana) ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉన్నారు. ఫలితాలు ప్రకటించే వేదిక వద్దకు విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా ఎవరూ రాలేదు. ఈ క్రమంలోనే అనేక తర్జనభర్జనల మధ్య.. ఫలితాల ప్రకటనను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 27 నుండి మే 9, 2022 వరకు జరిగాయి. పదోతరగతి పరీక్షలు ఏప్రిల్ 27-తెలుగు, ఏప్రిల్-28-సెకండ్ లాంగ్వేజ్, ఏప్రిల్ 29-ఇంగ్లిష్, మే 2-గణితం, మే 4-సైన్స్-4, మే 5-సైన్స్ పేపర్-2, మే 6న సోషల్ పరీక్షలు నిర్వహించారు. ఈ సారి ఏపీలో పదో తరగతి పరీక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3,776 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 6 లక్షల 2 1వేల 799 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలికలు 3 లక్షల 2 వేల 474 మంది, 3 లక్షల 63 మంది బాలురు ఉన్నారు. ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్ 50 మార్కుల చొప్పున.. మిగతా అన్ని పరీక్షలు 100 మార్కులకు నిర్వహించారు. ఈసారి గ్రేడ్‌లకు బదులు మార్కుల రూపంలో ఫలితాలు ప్రకటించనున్నారు.
ఇవాళ టెన్త్ ఫలితాలను ప్రకటించి ఉంటే.. ఏపీ విద్యాశాఖ రికార్డు సృష్టించి ఉండేది. కేవలం 25 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించిన బోర్డుగా ఖ్యాతి గడించేది. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో ఫలితాల ప్రకటన వాయిదా పడింది. సోమవారం రోజు పదో తరగతి ఫలితాలను ప్రకటిస్తారు. ఐతే ఆ రోజు ఏ సమయానికి ప్రకటిస్తారన్న వివరాలను మాత్రం ఏపీ విద్యాశాఖ వెల్లడించలేదు. మరోవైపు అధికారుల తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరి నిమిషంలో వాయిదా ఎందుకు వేశారని.. అంత ప్రిపేర్డ్‌గా లేనప్పుడు.. తేదీలను ఎందుకు ప్రకటించారని మండిపడుతున్నారు. సరైన ప్రణాళిక లేకుండా .. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.