ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి ఎగ్జామ్స్ (AP 10th Exam Results 2022) రాసినవారికి గుడ్ న్యూస్. మరో గంటల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. టెన్త్ ఎగ్జామ్స్ రాసిన ఆరు లక్షలకు పైగా విద్యార్థులు ఫలితాల (AP SSC Exam Results 2022) కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BSEAP) సరిగ్గా 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనుంది. ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ లో ఫలితాలు చెక్ చేయొచ్చు. ఈ వెబ్‌సైట్‌తో పాటు News18 Telugu వెబ్‌సైట్‌లో కూడా https://telugu.news18.com/ ఫలితాలు సులువుగా చెక్ చేయొచ్చు. ఏపీ టెన్త్ రిజల్ట్స్ చెక్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.
ముందుగా https://telugu.news18.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో Andhra Pradesh SSC Results 2022 లింక్ పైన క్లిక్ చేయండి.
హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి.
ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి.
ప్రింట్ తీసుకొని PDF ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవచ్చు.
Post Office Jobs: తెలుగు రాష్ట్రాల్లో పోస్ట్ ఆఫీసుల్లో 2,942 ఉద్యోగాలు... దరఖాస్తుకు 4 రోజులే గడువు
ఆంధ్రప్రదేశ్ టెన్త్ ఎగ్జామ్ రిజల్ట్స్‌ని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BSEAP) వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ లో కూడా చెక్ చేయొచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అవండి.
Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ జాబ్స్‌కి మరో నోటిఫికేషన్... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీల వివరాలివే
ముందుగా https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో టెన్త్ ఎగ్జామ్ ఫలితాల లింక్ పైన క్లిక్ చేయండి.
హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి.
ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి.
ప్రింట్ తీసుకొని PDF ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరిగాయి. 6 లక్షలకు పైగా విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. గత రెండేళ్లు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పరీక్షలు లేకుండానే విద్యార్థులు టెన్త్ క్లాస్ పాసయ్యారు. ఈసారి బోర్డు పరీక్షలు జరిగాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 10th class results, AP 10th Exams 2022, AP 10th Results 2022, JOBS, SSC results