హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP 10th Results 2022: ఏపీ టెన్త్ ఫలితాలు వచ్చేశాయి... డైరెక్ట్ రిజల్ట్స్ లింక్ ఇదే.. చెక్ చేసుకోండిలా

AP 10th Results 2022: ఏపీ టెన్త్ ఫలితాలు వచ్చేశాయి... డైరెక్ట్ రిజల్ట్స్ లింక్ ఇదే.. చెక్ చేసుకోండిలా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP 10th Results 2022 | బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BSEAP) టెన్త్ క్లాస్ ఫలితాలను (AP SSC Exam Results 2022) విడుదల చేసింది. ఈ లింక్ ద్వారా రిజల్ట్స్ చెక్ చేయండి.

ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి ఎగ్జామ్స్ (AP 10th Exam Results 2022) ఫలితాలు వచ్చేశాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఏపీ టెన్త్ ఫలితాలను (AP SSC Exam Results 2022) విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ లో ఫలితాలను చూసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌తో పాటు News18 Telugu వెబ్‌సైట్ https://telugu.news18.com/ లో కూడా అభ్యర్థులు తమ ఫలితాలు చేసుకోవచ్చు. విద్యార్థులు ఏపీ టెన్త్ రిజల్ట్స్ ను చెక్ చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.

ఏపీ ఎస్ఎస్‌సీ ఫలితాలను ఈ స్టెప్స్ తో డౌన్ లోడ్ చేసుకోవచ్చు..

Step 1: ముందుగా https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

Step 2: హోమ్ పేజీలో టెన్త్ ఎగ్జామ్ ఫలితాల లింక్ పైన క్లిక్ చేయండి.

Step 3: హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి.

Step 4: ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి.

Step 5: ప్రింట్ తీసుకొని PDF ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవచ్చు.

AP SSC Results 2022: ఏపీ టెన్త్ ఫలితాలు.. ఎవరైనా అలా చేస్తే ఏడేళ్ల జైలు.. జగన్ సర్కార్ సీరియస్ వార్నింగ్


 News18 Telugu వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి..

Step 1: ముందుగా https://telugu.news18.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

Step 2: హోమ్ పేజీలో Andhra Pradesh SSC Results 2022 లింక్ పైన క్లిక్ చేయండి.

Step 3: హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి.

Step 4: ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి.

Step 5: ప్రింట్ తీసుకొని PDF ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవచ్చు.


ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరిగాయి. 6 లక్షలకు పైగా విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. గత రెండేళ్లు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పరీక్షలు లేకుండానే విద్యార్థులు టెన్త్ క్లాస్ పాసయ్యారు. ఈసారి బోర్డు పరీక్షలు జరిగాయి.

First published:

Tags: 10th class results, AP 10th Results 2022, AP Board Results, AP ssc results, JOBS, SSC results

ఉత్తమ కథలు