Home /News /jobs /

AP 10TH NATURAL SCIENCE PAPER AP 10TH NATURAL SCIENCE MODEL PAPER DOWNLOAD DETAILS EVK

AP 10th Natural Science Paper: ఏపీ ప‌దోత‌ర‌గ‌తి ప్ర‌త్యేకం.. నెచుర‌ల్ సైన్స్ మోడ‌ల్ పేప‌ర్‌.. డౌన్‌లోడ్ వివ‌రాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP 10th Natural Science Paper | పదోతరగతి పరీక్ష విద్యార్థి జీవితంలో మొదటి మైలురాయి. తర్వాతి దశలో ఏ పరీక్షలకు హాజరైనా.. ఎలాంటి ఉద్యోగానికి ప్రయత్నించినా.. పదిలో సాధించిన మార్కులెన్నో పరిశీలిస్తారు. అభ్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. అందుకే ఈ పరీక్షలు అందరికీ ఎంతో ముఖ్యం.

ఇంకా చదవండి ...
    సేకరణ - అన్నా రఘు, అమరావతి, న్యూస్ 18 తెలుగు
    రచియిత - రోశయ్య, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పిడుగురాళ్ల

    పదోతరగతి పరీక్ష విద్యార్థి జీవితంలో మొదటి మైలురాయి. తర్వాతి దశలో ఏ పరీక్షలకు హాజరైనా.. ఎలాంటి ఉద్యోగానికి ప్రయత్నించినా.. పదిలో సాధించిన మార్కులెన్నో పరిశీలిస్తారు. అభ్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. అందుకే ఈ పరీక్షలు అందరికీ ఎంతో ముఖ్యం.  సిలబస్ ను 80 శాతానికి తగ్గించింది. విద్యార్థుల కోసం మారిన సైన్స్ సిలబస్ కు సంబంధించిన వివరాలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిడుగురాళ్ల కు చెందిన ఉపాధ్యాయుడు రోశయ్య న్యూస్ 18 కి తెలిపారు. నాచురల్ సైన్సు ప్రశ్న పత్రం లో నాలుగు విభాగాలు ఉంటాయని వివరించారు.
    మొదటి విభాగం లో పన్నెండు అర మార్క్ ప్రశ్నలు ఉంటాయి. ఇవి బిట్స్ వలే ఉంటాయి. వీటి మొత్తం మీద ఆరు మర్క్స్ సంపాధించవచ్చు. RUBP ని విస్తరించండి వంటి ఒక మాట ప్రశ్నలు ఉంటాయి.

    పదవతరగతి విద్యార్థులు  నాచురల్ సైన్సు పరీక్ష నందు మంచి మార్క్ లు సాధించటానికి డయాగ్రమ్స్, డేటా యానాలసిస్,టేబుల్స్ , ధమనులు సిరలు లోని బేధాలు   వంటి వాటి పై దృష్టి సాధిస్తే విద్యార్థులు మంచి మార్కులు స్కోర్ చేసే అవకాశాలు పుష్కలం గా ఉంటాయని వివరించారు.

    రెండవ విభాగం లో ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి ఇవి ఒక మార్క్ ప్రశ్నలు వీటికి ఒక మాట లో జవాబు వ్రాయవలెను.అన్ని ప్రశ్న లకు  జవాబు వ్రాయవలెను.మూత్రం యొక్క గాఢత మరియు "ఫ్" ను నియంత్రించేది ఏది వంటి చిన్న జవాబుల ప్రశ్నలు ఉంటాయి.

    మూడవ విభాగం లో ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి వీటిని చిన్న జవాబులతో పూరించాలి.ఒక ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున ఈ విభాగం లో పదహారు మార్కులు సాధించవచ్చు.అంటూ తొక్కుట గురించి వ్రాయండి వంటి చిన్న వ్యాసం ప్రశ్నలకు జవాబులు వ్రాయాలి.



    నాల్గవ విభాగంలో ఐదు ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకు నాలుగుమార్కులు ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక అవకాశం ఉంటుంది ఈ విభాగం లో వ్యాస రూప ప్రశ్నలు మరియు డ్రాయింగ్స్ ఉంటాయి. ఉచ్వాస నిఛ్వాసల మధ్య భేదాలను వ్రాయండి వంటి వ్యాస రూప ప్రశ్నలకు జవాబులు రాయాలి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: 10th Class Exams, Andhra Pradesh, Career and Courses

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు