ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ (AP Tenth Exams) కు సంబంధించిన ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. ఈ సారి కూడా బాలుర కంటే బాలికలే ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 67.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో (AP SSC Results) ప్రకాశం జిల్లా (Prakasham District) టాప్ స్థానంలో నిలిచింది, అనంతపురం జిల్లా 49 శాతం పాస్ పర్సంటేజ్ తో చివరి స్థానంలో ఉంది. వచ్చే నెల 6 నుంచి ఫెయిలయిన విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలను (Exams) నిర్వహించుకున్నారు. ఈ పరీక్షలు 15వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఫెయిలయిన విద్యార్థుల కోసం స్పెషల్ క్లాసులు సైతం నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు. జూన్ 13 నుంచి పరీక్షలు ప్రారంభం అయ్యే వరకు కూడా ఈ స్పెషల్ క్లాసులు కొనసాగుతాయని వెల్లడించారు. విద్యార్థులు రేపటి నుంచి అంటే ఈ నెల 7వ తేదీ మంగళవారం నుంచే ఇందుకు సంబంధించిన ఫీజుకు చెల్లించుకోవచ్చు.
ఇందులో బాయ్స్ పాస్ పర్సంటేజ్ 64.02 కాగా.. 70.70 శాతం మంది గర్ల్స్ ఉత్తీర్ణత సాధించారు. బాయ్స్ తో పోల్చితే గర్ల్స్ పర్సంటేజ్ 6.68 శాతం అధికంగా ఉంది. 797 శాతం పాఠశాలల్లో 100 శాతం పాస్ పర్సంటేజ్ నమోదు కావడం విశేషం. 71 స్కూళ్లలో సున్నా శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 78.30 శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది. అనంతపూర్ జిల్లాలో అత్యల్పంగా 49.70 శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది. ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో అత్యధికంగా 91.10 శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది. ప్రభుత్వ స్కూళ్లలో 50.10 శాతం నమోదైంది. రీ కౌంటింగ్ కావాలనుకుంటున్న అభ్యర్థులు సబ్జెక్టుకు రూ.500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. రీ వెరిఫికేషన్ తో పాటు ఆన్సర్ షీట్ కు సంబంధించిన జిరాక్స్ కాపీలను పొందాలంటే.. సబ్జెక్టుకు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు క్యాష్, డీడీ రూపంలో ఈ ఫీజును చెల్లించవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి ఎగ్జామ్స్ (AP 10th Exam Results 2022) ఫలితాలు వచ్చేశాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఏపీ టెన్త్ ఫలితాలను (AP SSC Exam Results 2022) విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ లో ఫలితాలను చూసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌తో పాటు News18 Telugu వెబ్‌సైట్ https://telugu.news18.com/ లో కూడా అభ్యర్థులు తమ ఫలితాలు చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 10th Class Exams, 10th class results, JOBS, Prakasham dist