AP 10TH EXAMS KNOW ABOUT ANDHRA PRADESH TENTH CLASS TELUGU EXAM PHYSICS MODEL PAPER HERE DETAILS NS GNT
AP SSC Physics Syllabus: ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఈ ఫిజిక్స్ మోడల్ పేపర్ ఇదే.. ఓ లుక్కేయండి
ప్రతీకాత్మక చిత్రం
మారిన ఫిజిక్స్ సిలబస్ కు సంబంధించిన వివరాలను ఉపాధ్యాయుడు మిద్దె శ్రీనివాసరావు న్యూస్ 18 కి తెలిపారు. ఫిజికల్ సైన్సు ప్రశ్న పత్రం లో నాలుగు విభాగాలు ఉంటాయని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే?
కరోనా(Corona) కష్టకాలం నుండి తేరుకుని ఈ విద్యాసంవత్సరం విద్యార్థులు ద్వితీయార్ధం నుంచి స్కూల్ కి వెళ్తున్న తరుణం ఇది. దీంతో విద్యార్థులకు పూర్తి స్థాయిలో సిలబస్ పూర్తి కాలేని పరిస్థితి. గత రెండేళ్లుగా ఎగ్జామ్స్ నిర్వహించలేని పరిస్థితి. అయితే.. ఈ ఏడాది అలాంటి పరిస్థితి రావొద్దని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఎలాగైనా ఎగ్జామ్స్ నిర్వహించాలని యోచిస్తున్నాయి. అయితే విద్యార్థులకు ఇబ్బంది కలిగించకుండా ఈ సారి 80 శాతానికి సిలబస్ ను కుదించింది ఏపీ ప్రభుత్వం. అయితే, మారిన ఫిజిక్స్ సిలబస్ కు సంబంధించిన వివరాలను మిద్దె శ్రీనివాసరావు SA(PS), A.G.K.M.HIGH SCHOOL,GUDIVADA న్యూస్ 18 కి తెలిపారు.
ఫిజికల్ సైన్సు ప్రశ్న పత్రం లో నాలుగు విభాగాలు ఉంటాయి మొదటి విభాగం లో పన్నెండు అర మార్క్ ప్రశ్నలు ఉంటాయి. ఇవి బిట్స్ వలే ఉంటాయి వీటి మొత్తం మీద ఆరు మర్క్స్ సంపాధించవచ్చు. ఉదాహరణ కు దేని లో ఆఫ్ భౌ నియమం ఉల్లంఘించింది? లాంటి ప్రశ్నలు ఉంటాయి.
-రెండో విభాగం లో ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి. ఇవి ఒక మార్క్ ప్రశ్నలు వీటికి ఒక మాట లో జవాబు రాయవలెను. అన్నిప్రశ్నలకు జవాబు రాయవలెను.
-మూడవ విభాగం లో ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి వీటిని చిన్న జవాబులతో పూరించాలి.ఒక ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున ఈ విభాగం లో పదహారు మార్కులు సాధించవచ్చు.
-నాల్గవ విభాగంలో ఐదు ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకు నాలుగుమార్కులు ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక అవకాశం ఉంటుంది ఈ విభాగం లో వ్యాస రూప ప్రశ్నలు మరియు డ్రాయింగ్స్ ఉంటాయి. AP SSC Math's Model Paper: ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. మారిన మాథ్స్ మోడల్ పేపర్ ఇదే..
పదవతరగతి విద్యార్థులు ఫిజికల్ సైన్సు పరిక్షనందు మంచి మార్క్ లు సాధించటానికి పరమాణు నమూనా,మూలకాల ఆవర్తన పట్టిక,లోహ సంగ్రహణ శాస్త్రం మరియు డ్రాయింగ్స్ వంటి వాటి పై ద్రుష్టి సాధిస్తే విద్యార్థులు మంచి మార్కులు స్కోర్ చేసే అవకాశాలు పుష్కలం గా ఉంటాయి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.