హోమ్ /వార్తలు /jobs /

AP SSC Exams: ఏపీలోని టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఈ సారి సైన్స్ మోడల్ పేపర్ ఇదే..

AP SSC Exams: ఏపీలోని టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఈ సారి సైన్స్ మోడల్ పేపర్ ఇదే..

విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేలా.. సిలబస్ ను 80 శాతానికి తగ్గించింది. విద్యార్థుల కోసం మారిన సైన్స్ సిలబస్ కు సంబంధించిన వివరాలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిడుగురాళ్ల కు చెందిన ఉపాధ్యాయుడు రోశయ్య న్యూస్ 18 కి తెలిపారు.

  సేకరణ: అన్నా రఘు, న్యూస్18 తెలుగు కరస్పాండెంట్, అమరావతి

  రచయిత: రోశయ్య, ఉపాధ్యాయుడు, పిడుగురాళ్ల

  కరోనా(Corona) ప్రభావంతో ఆయా ప్రభుత్వాలు టెన్త్ ఎగ్జామ్స్(Exams) ను నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వైరస్ ప్రభావం తగ్గడంతో ఈ సారి ఎలాగైనా ఎగ్జామ్స్ ను నిర్వహించాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ మేరకు ఎగ్జామ్స్ తేదీలు సైతం విడుదలయ్యాయి.  ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సైతం విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఎగ్జామ్స్ ను నిర్వహించాలని భావిస్తుంది. అయితే విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేలా.. సిలబస్ ను 80 శాతానికి తగ్గించింది. విద్యార్థుల కోసం మారిన సైన్స్ సిలబస్ కు సంబంధించిన వివరాలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిడుగురాళ్ల కు చెందిన ఉపాధ్యాయుడు రోశయ్య న్యూస్ 18 కి తెలిపారు. నాచురల్ సైన్సు ప్రశ్న పత్రం లో నాలుగు విభాగాలు ఉంటాయని వివరించారు.

  మొదటి విభాగం లో పన్నెండు అర మార్క్ ప్రశ్నలు ఉంటాయి. ఇవి బిట్స్ వలే ఉంటాయి. వీటి మొత్తం మీద ఆరు మర్క్స్ సంపాధించవచ్చు.RUBP ని విస్తరించండి వంటి ఒక మాట ప్రశ్నలు ఉంటాయి

  రెండవ విభాగం లో ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి ఇవి ఒక మార్క్ ప్రశ్నలు వీటికి ఒక మాట లో జవాబు వ్రాయవలెను.అన్ని ప్రశ్న లకు  జవాబు వ్రాయవలెను.మూత్రం యొక్క గాఢత మరియు ఫ్ ను నియంత్రించేది ఏది వంటి చిన్న జవాబుల ప్రశ్నలు ఉంటాయి.

  -మూడవ విభాగం లో ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి వీటిని చిన్న జవాబులతో పూరించాలి.ఒక ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున ఈ విభాగం లో పదహారు మార్కులు సాధించవచ్చు.అంటూ తొక్కుట గురించి వ్రాయండి వంటి చిన్న వ్యాసం ప్రశ్నలకు జవాబులు వ్రాయాలి

  -నాల్గవ విభాగంలో ఐదు ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకు నాలుగుమార్కులు ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక అవకాశం ఉంటుంది ఈ విభాగం లో వ్యాస రూప ప్రశ్నలు మరియు డ్రాయింగ్స్ ఉంటాయి. ఉచ్వాస నిఛ్వాసల మధ్య భేదాలను వ్రాయండి వంటి వ్యాస రూప ప్రశ్నలకు జవాబులు వ్రాయవలెను.

  పదవతరగతి విద్యార్థులు  నాచురల్ సైన్సు పరీక్ష నందు మంచి మార్క్ లు సాధించటానికి డయాగ్రమ్స్, డేటా యానాలసిస్,టేబుల్స్ , ధమనులు సిరలు లోని బేధాలు   వంటి వాటి పై దృష్టి సాధిస్తే విద్యార్థులు మంచి మార్కులు స్కోర్ చేసే అవకాశాలు పుష్కలం గా ఉంటాయని వివరించారు.

  First published:

  ఉత్తమ కథలు