సేకరణ: రఘు, న్యూస్18 తెలుగు కరస్పాండెంట్, గుంటూరు
రచయిత: సత్యనారాయణ, ఉపాధ్యాయుడు, జడ్పీహెచ్ఎస్, పిడుగురాళ్ల
గత రెండేళ్లుగా కరోనా (Corona) ప్రభావంతో ఆయా ప్రభుత్వాలు టెన్త్ ఎగ్జామ్స్ (Exams) ను నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వైరస్ ప్రభావం తగ్గడంతో ఈ సారి ఎలాగైనా ఎగ్జామ్స్ ను నిర్వహించాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ మేరకు ఎగ్జామ్స్ తేదీలు సైతం విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సైతం విద్యార్థుల (Students) భవిష్యత్ దృష్ట్యా ఎగ్జామ్స్ ను నిర్వహించాలని భావిస్తుంది. అయితే విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేలా.. సిలబస్ ను 80 శాతానికి తగ్గించింది దీంతో ప్రశ్నాపత్రాల కూర్పు కూడా మారుతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం మోడల్ పేపర్లు అందిస్తోంది న్యూస్18 తెలుగు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా పరిషత్ హై స్కూల్ పిడుగురాళ్ల కి చెందిన సత్యనారాయణ గారు రూపొందించిన మోడల్ పేపర్ విద్యార్థుల కోసం..
పేపర్ ఎలా ఉంటుందంటే?
-మొదటి సెక్షన్ లో నాలుగు ప్రశ్నలు ఉంటాయి వాటి లో ప్రతి విభాగం లో పద్యాల కి తాత్పర్యాన్ని వివరించటం,కొంత పద్యాన్ని ఇస్తే పూరించటం మరియు పురాణాలలోని సంఘటనలను సంఘటనా క్రమం లో అమర్చటం వంటి ప్రశ్నలు మొదటి విభాగం లో ఉంటాయి
-రెండవ సెక్షన్ లో మూడు నాలుగు మార్కుల ప్రశ్నలు మూడు ఎనిమిది మార్క్ ల ప్రశ్నలు ఉంటాయి ఈ విభాగం మొత్తం వ్యక్తీకరణ సృజనాత్మకత నుండి ప్రశ్నలు ఉంటాయి.హనుమంతుని పాత్ర స్వభావము వ్రాయండి వంటి ప్రసంగాలు మూడింటి కి జవాబులు వ్రాయవలెను.సీతాపహరణం గూర్చి వ్రాయండి వంటి వ్యాస రూప ప్రశ్నలు మూడు ఉంటాయి.
-మూడవ విభాగం లో భాషాంశాలకు సంబంధించి ఒక మార్క్ 17 ప్రశ్నలు,రెండు మార్కుల ప్రస్నాలు ఐదు ఉంటాయి.
AP 10Th Social Paper: విద్యార్థులకు అలర్ట్.. ఏపీ టెన్త్ సోషల్ పేపర్ ఎలా ఉంటుందంటే?
ఐతే విద్యార్థులు వ్యాకరణము, రామాయణము మరియు పద్య భాగము లో మాతృ భావనా,బిక్ష పాఠ్యాంశములు గద్య భాగం లో నా ప్రయత్నము,జానా పదుల జాబు మొదలైనవాటి పై పట్టు సాధిస్తే విద్యార్థులు అవలీలగా అరవై శాతం మార్కులు పొందవచ్చని తెలుగు ఉపాధ్యాయుడు సత్యనారాయణ గారు తెలియచేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP 10th Exams 2022, AP SSC board exams, Career and Courses, Exams