Home /News /jobs /

AP 10TH EXAMS KNOW ABOUT ANDHRA PRADESH TENTH CLASS SOCIAL EXAM SYLLABUS DETAILS HERE GNT NS

AP 10Th Social Paper: విద్యార్థులకు అలర్ట్.. ఏపీ టెన్త్ సోషల్ పేపర్ ఎలా ఉంటుందంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో టెన్త్ సిలబస్ ను ఎనభై శాతానికి కుదించి రూపొందించనున్నట్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామవరప్పాడు కు చెందిన సోషల్ టీచర్ షైక్ సైరున్నీసా బేగం న్యూస్ 18 కి తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

    సేకరణ: అన్నా రఘు, న్యూస్18 కరస్పాండెంట్, గుంటూరు
    రచయిత: షేక్ సైరున్నీసా బేగం, టీచర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రామవరప్పాడు.

    కరోనా(Corona) సమయం లో పదవ తరగతి విద్యార్థుల అందరిని తరువాతి తరగతులకు  ప్రమోట్ చేసింది. కానీ పదవ తరగతి (Tenth Class)మార్క్ లు ప్రతి విద్యార్ధి కి కొలమానం గా ఉంటాయి కరోనా సమయం లో ఉతీర్ణత సాధించిన విద్యార్థులకు వారి విద్యార్హతను బట్టి గ్రేడ్ లను  కేటాయించలేదు ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు(Exams) నిర్వహించి విద్యార్థుల విద్య ప్రమాణాలను బట్టి వారి ని ప్రమోట్ చేసే ఆలోచనలో భాగం గా ప్రభుత్వం  సోషల్  ప్రశ్నా పత్రం ను గతం లో లాగే యాబై మార్కులకు రూపొందించింది. సిలబస్ ను ఎనభై శాతం కు కుదించి రూపొందించారని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామవరప్పాడు కు చెందిన సోషల్ టీచర్ షేక్ సైరున్నీసా బేగం న్యూస్ 18 కి తెలిపారు.

    ప్రతీ ప్రశ్నపత్రం కు 3:15 సమయం ఉంటుంది. పదిహేను నిముషాలు పాపేరును శ్రద్ధ గా చదువుకొని మిగిలిన మూడు గంటలలో ప్రశ్నపత్రం పూర్తిచేయాలి. దస్తూరి గుండ్రంగా, అర్థమయ్యేలా ఉండాలి. సోషల్ స్టడీస్ ప్రశ్నపత్రం లో నాలుగు విభాగాలు ఉంటాయి మొదటి విభాగం లో పన్నెండు  మార్క్ ప్రశ్నలు ఉంటాయి ఈ ప్రశ్నలకు ఒక మాట జవాబులు వ్రాయాలి  ఈ ప్రశ్నలను సులభంగా పూర్తి చేసి మొత్తం మీద పన్నెండు మర్క్స్ సంపాధించాలి.
    AP 10th Science Exam: ఏపీలోని టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఈ సారి సైన్స్ సిలబస్ ఇదే.. వివరాలివే

    రెండవ విభాగం లో ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి ఇవి రెండు మార్క్ ప్రశ్నలు వీటికి రెండు మూడు వాక్యాలలో  జవాబు వ్రాయవలెను.అన్ని ప్రశ్నలకు జవాబు రాయవలెను. మూడవ విభాగం లో ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి వీటిని ఐదు నుండి ఆరు వాక్యాలలో జవాబులతో పూరించాలి.ఒక ప్రశ్నకునాలుగు మార్కులు చొప్పున ఈ విభాగం లో ముప్పేరెండు  మార్కులు సాధించవచ్చు.
    AP 10th Class English Paper: విద్యార్థులకు అలర్ట్.. ఏపీలో టెన్త్ ఇంగ్లిష్ సిలబస్ ఇదే..

    నాల్గవ విభాగంలో ఐదు ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకు ఎనిమిది మార్కులు ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక అవకాశం ఉంటుంది ఈ విభాగం లో వ్యాస రూప ప్రశ్నలు మరియు మ్యాప్స్,అవగాహనకు సంబంధించిన ప్రశ్నలకు ఉంటాయి.

    పదో తరగతి  విద్యార్థులు సోషల్ స్టడీస్ లో భారత దేశ భవగోళిక స్వరూపాలు,అభివృద్ధి భావనలు,ఉత్పత్తి ఉపాధి,సమగ్ర భారత దేశం ఊరించిన అవగాహనా మరియు మ్యాప్స్ ను గుర్తించటం వంటి విషయాలలో అవగాహన పెంచుకుంటే సోషల్ స్టడీస్ పరీక్షా లో మంచి మార్కులతో ఉతీర్ణత సాధించవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: AP 10th Exams 2022, AP SSC board exams, Career and Courses, Exams

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు