Home /News /jobs /

AP 10TH EXAMS KNOW ABOUT ANDHRA PRADESH TENTH CLASS MATHS EXAM SYLLABUS HERE DETAILS NS

AP SSC Maths Syllabus: ఏపీలో టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. మారిన మాథ్స్ సిలబస్ ఇదే.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓమిక్రాన్ నేపథ్యం లో కూడా స్కూల్స్ పాక్షికంగా జరగటం తో ప్రభుత్వం సిలబస్ ను కుదించి ఎనబై శాతం సిలబస్ కు పరీక్షా పత్రం రూపొందించిందని లెక్కల మాస్టరు బి.నరసింహారావు   జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు  న్యూస్ 18 కి తెలిపారు.

    సేకరణ: అన్నా రఘు, న్యూస్ 18 కరస్పాండెంట్,  గుంటూరు

    రచయిత:  బి.నరసింహారావు, జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు 

    కరోనా జీవితాల్ని మార్చేసింది అలాగే పెద్దలు పిల్లల జీవితాల పై పెద్ద ప్రభావమే చూపింది కరోనా కష్టకాలం నుండి తేరుకుని ఈ విద్యాసంవత్సరం విద్యార్థులు ద్వితీయార్ధం నుండి స్కూల్ కి వెళుతున్న తరుణం లో విద్యార్థులకు పూర్తి స్థాయి లో సిలబస్ పూర్తి కాకపోవటం మధ్యలో ఓమిక్రాన్ నేపథ్యం లో కూడా స్కూల్స్ పాక్షికంగా జరగటం తో ప్రభుత్వం సిలబస్ ను కుదించి ఎనబై శాతం సిలబస్ కు పరీక్షా పత్రం రూపొందించిందని లెక్కల మాస్టరు బి.నరసింహారావు   జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు  న్యూస్ 18 కి తెలిపారు. పదవ తరగతి గణిత శాస్త్రం లో పద్నాలుగు అధ్యయాలు గాను రెండు అధ్యయాలు తొలగించి పన్నెండు అధ్యాయాల సిలబస్ నుండి ప్రశ్నపత్రాన్ని రూపొందించారు. గణిత శాస్త్రం పేపర్ మొత్తం వంద మార్కులకు ఉంటుంది ప్రశ్నపత్రాన్ని నాలుగు విభాగాలుగా విభజించారు .
    మొదటి విభాగం లో  పన్నెండు ప్రశ్నలు ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక మార్క్ ఇవి అతి చిన్న సమాధాన ప్రశ్నలుగా ఉంటాయి.

    -రెండవ విభాగం లో ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి ఒక్కొక్క దానికి రెండు మార్కులు వీటికి  చిన్న సమాదానాలు రాయవలసి ఉంటుంది.
    -మూడవ విభాగం లో కూడా ఎనిమిది ప్రసంగాలు ఉంటాయి కానీ మూడవ విభాగం లోని ఒక్కొక్క ప్రశ్నకు నాలుగు మార్కులు వీటిని చిన్న గణిత ప్రశ్నలుగా పిలుస్తారు వీటిని మూడు లేదా నాలుగు స్టెప్పులతో వీటిని పూర్తిచేయాలి.
    Exams Cancel: అన్ని బోర్డుల 10, 12వ తరగతి ఎగ్జామ్స్ రద్దు.. పిల్ పై సుప్రీం కీలక నిర్ణయం

    -నాల్గవ విభాగం లో ఐదు ప్రశ్నలు ఉంటాయి ఒక్కోక్కా దానికి ఎనిమిది మార్కులు వీటికి అంతర్గత ఎంపిక సదుపాయం కలదు అంటే  ప్రతి ప్రశ్నకు ఒక ఆప్షన్ కలదు వీటిని పెద్ద లెక్కల ప్రశ్నలుగా వ్యవహరిస్తారు .
    -మొత్తం గా క్రిస్టల్ నిర్మాణం, sat, sets సమితులు, వాస్తవ సంఖ్యలు త్రికోణమితి లో పట్టు సాధిస్తే లెక్కల పరీక్ష నల్లేరు మీద నడకలా మంచి మార్కులు సాధించవచ్చు అని తెలిపారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Career and Courses, Exams, TS 10th Exams 2022

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు