Home /News /jobs /

AP 10TH EXAMS KNOW ABOUT ANDHRA PRADESH TENTH CLASS MATHEMATICS EXAM MODEL PAPER DETAILS HERE NS GNT

AP SSC Math's Model Paper: ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. మాథ్స్ మోడల్ పేపర్ ఈ సారి ఇలా.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేలా.. సిలబస్ ను 80 శాతానికి తగ్గించింది. పదవ తరగతి గణిత శాస్త్రం లో పద్నాలుగు అధ్యయాలు గాను రెండు అధ్యయాలు తొలగించి పన్నెండు అధ్యాయాల సిలబస్ నుండి ప్రశ్నపత్రాన్ని రూపొందించారు.

    సేకరణ: అన్నా రఘు, న్యూస్18 ప్రతినిధి, అమరావతి
    గత రెండేళ్లుగా కరోనా ప్రభావంతో ఆయా ప్రభుత్వాలు టెన్త్ ఎగ్జామ్స్ ను నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వైరస్ ప్రభావం తగ్గడంతో ఈ సారి ఎలాగైనా ఎగ్జామ్స్ను నిర్వహించాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ మేరకు ఎగ్జామ్స్ తేదీలు సైతం విడుదలయ్యాయి.  ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సైతం విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఎగ్జామ్స్ ను నిర్వహించాలని భావిస్తుంది. అయితే విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేలా.. సిలబస్ ను 80 శాతానికి తగ్గించింది. పదవ తరగతి గణిత శాస్త్రం లో పద్నాలుగు అధ్యయాలు గాను రెండు అధ్యయాలు తొలగించి పన్నెండు అధ్యాయాల సిలబస్ నుండి ప్రశ్నపత్రాన్ని రూపొందించారు. గణిత శాస్త్రం పేపర్ మొత్తం వంద మార్కులకు ఉంటుంది ప్రశ్నపత్రాన్ని నాలుగు విభాగాలుగా విభజించారు

    మొదటి విభాగం లో  పన్నెండు ప్రశ్నలు ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక మార్క్ ఇవి అతి చిన్న సమాధాన ప్రశ్నలుగా ఉంటాయి.A={1,2,3},B={2,3,4} ఐయితే a u b ని కనుగొనండి  వంటి ప్రశ్నలు ఉంటాయి.
    AP SSC English Model Paper: ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఇంగ్లిష్ మోడల్ పేపర్ ఇదే..

    -రెండవ విభాగం లో ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి ఒక్కొక్క దానికి రెండు మార్కులు వీటికి  చిన్న సమాదానాలు రాయవలసి ఉంటుంది.21og3+31og2+1og5-1og12  ను సూక్ష్మీకరించండి. వంటి ప్రశ్నలు ఉంటాయి.

    -మూడవ విభాగం లో కూడా ఎనిమిది ప్రసంగాలు ఉంటాయి కానీ మూడవ విభాగం లోని ఒక్కొక్క ప్రశ్నకు నాలుగు మార్కులు వీటిని చిన్న గణిత ప్రశ్నలుగా పిలుస్తారు వీటిని మూడు లేదా నాలుగు స్టెప్పులతో వీటిని పూర్తిచేయాలి.క్రింది ఇచ్చిన ప్రతి సమితి లో A =B అవుతుందో లేదో తెలుపండి.A={a,b,c,d} వంటి ప్రశ్నలు ఉంటాయి
    నాల్గవ విభాగం లో ఐదు ప్రశ్నలు ఉంటాయి. ఒక్కోక్కా దానికి ఎనిమిది మార్కులు వీటికి అంతర్గత ఎంపిక సదుపాయం కలదు.


    -మొత్తం గా క్రిస్టల్ నిర్మాణం, sat, sets సమితులు, వాస్తవ సంఖ్యలు త్రికోణమితి లో పట్టు సాధిస్తే లెక్కల పరీక్ష నల్లేరు మీద నడకలా మంచి మార్కులు సాధించవచ్చు అని తెలిపారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Career and Courses, Exams, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు