కరోనా కల్లోలం నుండి తేరుకున్న విద్యార్థులు బడి బాట పట్టి సజావుగా సాగుతున్న వేళ ఒమిక్రాన్ మళ్లీ కల్లోలం సృష్టించింది. టెన్త్ విద్యార్ధి భావి జీవితానికి పునాది వంటిది. టెన్త్ లో అభ్యర్థులు మంచి పట్టు సాధిస్తే భవిష్యత్ బాగుంటుందని నిపుణులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా ఎగ్జామ్స్ నిర్వహించలేని పరిస్థితి. అయితే.. ఈ ఏడాది అలాంటి పరిస్థితి రావొద్దని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఎలాగైనా ఎగ్జామ్స్ నిర్వహించాలని యోచిస్తున్నాయి. అయితే విద్యార్థులకు ఇబ్బంది కలిగించకుండా ఈ సారి 80 శాతానికి సిలబస్‌ను కుదించింది. అయితే, మారిన ఫిజిక్స్ సిలబస్ కు సంబంధించిన వివరాలను పిడుగురాళ్లకు చెందిన కృష్ణమూర్తి న్యూస్ 18 కి తెలిపారు. ఫిజికల్ సైన్సు ప్రశ్న పత్రం లో నాలుగు విభాగాలు ఉంటాయి మొదటి విభాగం లో పన్నెండు అర మార్క్ ప్రశ్నలు ఉంటాయి. ఇవి బిట్స్ వలే ఉంటాయి వీటి మొత్తం మీద ఆరు మర్క్స్ సంపాదించవచ్చు.
రెండో విభాగం లో ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి. ఇవి ఒక మార్క్ ప్రశ్నలు వీటికి ఒక మాట లో జవాబు రాయవలెను. అన్ని ప్రసంగాలకు జవాబు రాయవలెను.
మూడవ విభాగం లో ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి వీటిని చిన్న జవాబులతో పూరించాలి.ఒక ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున ఈ విభాగం లో పదహారు మార్కులు సాధించవచ్చు. Telangana SSC Maths News Syllabus: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. మాథ్స్ లో ఈ అంశాలు సిలబస్ నుంచి తొలగింపు
పదవతరగతి విద్యార్థులు ఫిజికల్ సైన్సు పరిక్షనందు మంచి మార్క్ లు సాధించటానికి పరమాణు నమూనా,మూలకాల ఆవర్తన పట్టిక,లోహ సంగ్రహణ శాస్త్రం మరియు డ్రాయింగ్స్ వంటి వాటి పై ద్రుష్టి సాధిస్తే విద్యార్థులు మంచి మార్కులు స్కోర్ చేసే అవకాశాలు పుష్కలం గా ఉంటాయి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.