హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs In Secunderabad: సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ లో 419 ఉద్యోగాలు.. అర్హత, ఇతర వివరాలిలా..

Jobs In Secunderabad: సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ లో 419 ఉద్యోగాలు.. అర్హత, ఇతర వివరాలిలా..

Jobs In Secunderabad: సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ లో 419 ఉద్యోగాలు.. అర్హత, ఇతర వివరాలిలా..

Jobs In Secunderabad: సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ లో 419 ఉద్యోగాలు.. అర్హత, ఇతర వివరాలిలా..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ వివిధ రీజియన్లలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

సెంట్రల్ రిక్రూట్‌మెంట్ సెల్ (CRC) AOC సికింద్రాబాద్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ AOC సికింద్రాబాద్ రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్ ద్వారా మెటీరియల్ అసిస్టెంట్ (MA) పోస్టులను భర్తీ చేయనుంది. మెటీరియల్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 419 ఖాళీగా ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 23/10/2022

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 12/11/2022

దరఖాస్తు ఫీజు.. 

UR / OBC / EWS: రూ: 100

SC / ST / స్త్రీ: ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

వయోపరిమితి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు

అర్హత

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ లేదాఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా విభాగంలో మెటీరియల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

Andhra Pradesh Jobs : డిగ్రీ అర్హతతో.. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు .. రూ.76వేల వేతనం..

ఖాళీల వివరాలు

ప్రాంతం             రాష్ట్రం / UT పోస్ట్ సంఖ్య
తూర్పుఅస్సాం, అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్, మణిపూర్10
వెస్టర్న్ ఢిల్లీ, పంజాబ్ , హిమాచల్ ప్రదేశ్ , హర్యానా120
ఉత్తరజమ్మూ & కాశ్మీర్, లడఖ్23
దక్షిణమహారాష్ట్ర, తెలంగాణ , తమిళనాడు32
నైరుతిరాజస్థాన్, గుజరాత్23
సెంట్రల్ వెస్ట్మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ , ఉత్తరాఖండ్185
సెంట్రల్ ఈస్ట్పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, సిక్కిం26

కేటగిరీల వారీగా ఇలా.. 

కేటగిరిపోస్టులు
UR  171
EWS 42
OBC 113
ఎస్సీ 62
ST31
మొత్తం 419

NEET-UG 2022 Counselling: నీట్ రెండో దశ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడదుల.. ఆ రోజు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం..

రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్, ఫిజికల్ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.29,200ల నుంచి రూ.92,300ల వరకు జీతంగా చెల్లిస్తారు.

రాత పరీక్ష విధానం..

రాత పరీక్ష మొత్తం 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు, 150 మార్కులను కేటాయించనున్నారు. మొత్తం 2 గంటల సమయం కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

జనరల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో 50 ప్రశ్నలకు 50 మార్కులు

న్యూమరిక్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలో 25 ప్రశ్నలకు 25 మార్కులు

జనరల్ అవేర్‌నెస్ విభాగంలో 25 ప్రశ్నలకు 25 మార్కులు

ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ విభాగంలో 50 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటుంది.

నోటిఫికేషన్ పీడీఎఫ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

First published:

Tags: Army jobs, Career and Courses, JOBS

ఉత్తమ కథలు