హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

3D Printing: ఫ్యూచర్ కెరీర్ ఆప్షన్‌గా 3D ప్రింటింగ్ సెక్టార్.. ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఇవే..

3D Printing: ఫ్యూచర్ కెరీర్ ఆప్షన్‌గా 3D ప్రింటింగ్ సెక్టార్.. ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఇవే..

3D Printing

3D Printing

3D Printing: 3D ప్రింటింగ్ అనేది వేగవంతమైన టర్న్-అరౌండ్ టైమ్‌ను అందిస్తూ, చిన్న వాల్యూమ్‌తో కస్టమైజ్డ్ ఉత్పత్తులను రూపొందించడానికి ఉపయోగపడుతుంది. అయితే భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం దీని ద్వారా సాధ్యం కాదు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

సమీప భవిష్యత్తులో 3D ప్రింటింగ్‌(3D Printing)కు డిమాండ్ (Demand) పెరగనుంది. ఈమేరకు దానికి సంబంధించిన అప్లికేషన్స్ (Applications) కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆసుపత్రు (Hospitals)ల్లో మానవ అవయవాల ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం త్రీడీ ప్రింటింగ్ అవసరం కావచ్చు. ప్రస్తుతం ఇది సాధ్యం కానప్పటికీ, టెక్నాలజీ (Technology) అభివృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి, ఫ్యూచర్‌లో 3D ప్రింటింగ్‌కు డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు.వేగం, సామర్థ్యం, ​​సరళత, డిజైన్ ఫ్రీడం, విశ్వసనీయత, కచ్చితత్వం వంటి అనేక ప్రయోజనాల కారణంగా ఈ టెక్నాలజీ వినియోగం భవిష్యత్తులో విపరీతంగా పెరగబోతోంది. 3D ప్రింటింగ్ అనేది వేగవంతమైన టర్న్-అరౌండ్ టైమ్‌ను అందిస్తూ, చిన్న వాల్యూమ్‌తో కస్టమైజ్డ్ ఉత్పత్తులను రూపొందించడానికి ఉపయోగపడుతుంది. అయితే భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం దీని ద్వారా సాధ్యం కాదు.


3డి ప్రింటింగ్ భారతదేశంలో తయారీ రంగాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది. కచ్చితత్వంతో కూడిన వివరాల కోసం కొత్త సాంకేతికతలపై ఆసక్తి ఉన్న ఎవరైనా, వేగంగా విస్తరిస్తున్న 3D ప్రింటింగ్ ప్రపంచంపై ప్రత్యేక దృష్టిసారిస్తే చాలా విషయాలు తెలుసుకుంటారు. ఈ టెక్నాలజీ అంచనా వృద్ధిని బట్టి, ఈ రంగంలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఇదే సరైన సమయమని నిపుణులు భావిస్తున్నారు.



** 3డీ ప్రింటింగ్‌లో కెరీర్ అవసరాలు


ఈ రంగంలో నిపుణుడిగా మారడానికి ఉన్న ఐడియల్ కాంబినేషన్స్ పరిశీలిద్దాం.


* ఇంజనీరింగ్ లేదా డిజైన్, యానిమేషన్, మెడికల్ టెక్నాలజీస్ లేదా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో డిగ్రీ కాంబినేషన్‌తో తీడ్రీ పింటింగ్.


* ప్రాజెక్ట్‌లను ప్లాన్ చేయడానికి, డిజైన్ చేయడం కోసం 3డీ CAD కోర్సు


* మెకానికల్ ఆపరేషన్స్, 3D ప్రింటర్ల తయారీ అప్లికేషన్స్ గురించి పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి అవసరమయ్యే కోర్సు.


ఈ మూడు ఐడియల్ కాంబినేషన్స్ 3D ప్రింటింగ్ చుట్టూ కేంద్రీకృతమైన కొత్త రోల్స్‌కు స్ప్రింగ్‌బోర్డ్‌గా ఉపయోగపడతాయి. 3D ప్రింటింగ్‌లో వృత్తిని కొనసాగించాలనుకునే ఎవరైనా 3D ప్రింటింగ్ కోసం తాజా టెక్నాలజీ డెవలప్‌మెంట్, మార్కెట్ డిమాండ్‌ గురించి తెలుసుకోవాలి. 3డీ ప్రింటింగ్ అనేది నిరంతరం నేర్చుకునే ప్రక్రియ. కాబట్టి స్కిల్స్ విషయంలో నిరంతరం అప్‌డే‌ట్‌గా ఉండాలి.


* 3డీ ప్రింటింగ్‌లో కెరీర్ అవకాశాలు
3D ప్రింటింగ్ రంగ వృద్ధి అనేది తయారీ ప్రక్రియపై ప్రభావం చూపి, కొత్త జాబ్ రోల్స్ సృష్టిస్తోంది. అనేక పరిశ్రమలు 3D ప్రింటింగ్‌ని ఉపయోగిస్తున్నాయి. దీంతో ఎక్కువ నైపుణ్యం ఉన్న నిపుణులకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా దొరుకుతున్నాయి.


తేలికగా, దృఢమైన భాగాలను చాలా వేగంగా, తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసే సామర్థ్యం ఏరోస్పేస్ నిపుణులకు ఉపయోగపడుతుంది. 3డీ ప్రింటింగ్, డిజైన్‌లో నైపుణ్యం ఉన్న ఇంజనీర్లకు ఈ రంగం అనేక అవకాశాలను అందిస్తుంది.


ఇది కూడా చదవండి : మేనేజ్‌‌మెంట్‌లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు .. పూర్తి వివరాలివే..


బోయింగ్, ఎయిర్‌బస్, నాసా వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఇంజిన్స్, ఉపగ్రహాలు, ఎయిర్‌క్రాఫ్ట్ బాడీస్ అండ్ ఫిక్చర్స్ కోసం విడిభాగాలను ఉత్పత్తి చేయడానికి 3D ప్రింటింగ్‌ను ఉపయోగిస్తున్నాయి. ఆటోమోటివ్ పరిశ్రమ కూడా, తేలికపాటి భాగాలను ముద్రించే సామర్థ్యం నుంచి ప్రయోజనాలను పొందుతుంది.


ఇంటీరియర్ డిజైన్ పరిశ్రమలో కూడా 3డి ప్రింటింగ్ ప్రవేశిస్తోంది. ఫ్యాషన్ డిజైన్, జ్యువెలరీ డిజైన్, ప్రొడక్ట్ డిజైన్ వంటి రంగాలు కూడా 3డి ప్రింటింగ్ నుంచి ప్రయోజనం పొందుతాయి. అలాగే సినీ పరిశ్రమకు సంబంధించి సెట్స్, కాస్ట్యూమ్స్ డిజైన్‌లో 3డి ప్రింటింగ్ నిపుణులకు ఎంతో డిమాండ్ ఉంది.


బయో-ప్రింటింగ్, ప్రోస్తెటిక్స్ వంటి అప్లికేషన్ల ద్వారా వైద్య రంగంలో కొత్త పురోగతులను వేగవంతం చేస్తోంది. 3డి ప్రింటింగ్ ద్వారా సర్జికల్ ప్లానింగ్ బాగా మెరుగుపడింది. డెంటిస్ట్రీ, మాక్సిల్లోఫేషియల్, ప్లాస్టిక్ సర్జరీల్లో ఈ టెక్నాలజీని ఎక్కువగా వినియోగిస్తున్నారు.

First published:

Tags: CAREER, Career and Courses, EDUCATION, JOBS

ఉత్తమ కథలు