హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Jobs: తెలంగాణలో.. మరో 2,391 కొత్త ఉద్యోగాలు..

Telangana Jobs: తెలంగాణలో.. మరో 2,391 కొత్త ఉద్యోగాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో మరో 2,391 కొత్త ఉద్యోగాలకు ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించింది. ఈ మేరకు పోస్టుల వివరాలు .. జీవో కాపీలను మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణలో మరో 2,391 కొత్త ఉద్యోగాలకు ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించింది. ఈ మేరకు పోస్టులకు సంబంధించి వివరాలు .. జీవో కాపీలను మంత్రి హరీశ్ రావు ట్విట్టర్(Twitter) లో పోస్ట్ చేశారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించిన పోస్టుల్లో టీజీటీ, పీజీటీ, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్(Junior College Lecturers), డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్(Degree College Lecturers) వంటి పోస్టులు ఉన్నాయి.

పోస్టుల వివరాల్లోకి వెళ్తే..

బీసీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ నుంచి 141 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. గ్రూప్ 4లోని జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు , మహాత్మాజ్యోతి బాఫూలే వెల్ఫేర్ ఇనిస్టిట్యూట్ నుంచి అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు.. మరో  1499 టీజీటీ, పీజీటీ తదితర పోస్టులు కూడా బీసీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ నుంచి అనుమతులు మంజూరయ్యాయి.

విభాగాల వారీగా ఇలా..

అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ - 41

అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ - 16

ఉర్దూ ఎడిటర్ - 01

ఇన్ఫర్మేషన్ టెక్నీషియన్ - 22

పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ - 04

పబ్లిసిటి అసిస్టెంట్ - 82

వీటితో పాటు..

స్కూల్ ప్రిన్సిపల్ పోస్టులు - 10

డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ - 480

జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ - 185

పోస్ట్ గ్రాడ్యూయేట్ టీచర్స్ - 235

టీజీటీ - 324

లైబ్రేరియన్ - 11

డిగ్రీ కాలేజ్ లైబ్రేరియన్ - 37

స్కూల్ లైబ్రరీ - 11

డిగ్రీ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్స్ - 20

స్కూల్ పీఈటీ - 33

ఆర్ట్ / క్రాఫ్ట్ / మ్యూజిక్ - 33

అసిస్టెంట్ లైబ్రేరియన్ ఇన్ డిగ్రీ కాలేజ్ - 15

ల్యాబ్ అసిస్టెంట్ - 60

కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ - 30

స్టోర్ కీపర్ - 15

ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అతి త్వరలో విడుదల కానుంది.

First published:

Tags: JOBS, Minister harishrao, Telangana jobs, TSPSC

ఉత్తమ కథలు