గ్రూప్ 4 ఉద్యోగాలకు మరో 141 పోస్టులను కలుపుతూ టీఎస్పీఎస్సీ(TSPSC) ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఇప్పటికే 8039 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. వీటి దరఖాస్తుల గడువు జనవరి 30తో ముగియనున్నది. అయితే.. తాజాగా మరో 141 పోస్టులను కలపడంతో ఈ పోస్టుల సంఖ్య 8180కి చేరాయి. దీంతో దరఖాస్తుల గడువు కూడా పెంచే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. జనవరి 27న తెలంగాణ(Telangana) ఆర్థిక శాఖ 2,391 పోస్టులకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్థికశాఖ ఇప్పటికే 60,929 ఉద్యోగాలకు అనుమతి ఇవ్వగా.. ఇప్పుడు కొత్తగా అనుమతి ఇచ్చిన 2,391 ఉద్యోగాలను కలిపితే మొత్తం 63,320 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
ఈ 2,391 ఉద్యోగాలలో బీసీ గురుకుల విద్యాలయాల్లో అత్యధికంగా 1,499 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను గురుకుల నియామక మండలి ద్వారా భర్తీ చేస్తారు. ఇప్పటికే గురుకుల పోస్టులు 10వేలకు పైగా ఆర్థిక శాఖ ఆమోదించింది. వాటితో పాటు.. ఇవి అదనంగా ఉన్నాయి. ఇక ఈ 1499 పోస్టుల్లో టీచింగ్ పోస్టులతో పాటు.. నాన్ టీచింగ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. 10 ప్రిన్సిపాల్,30 కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ , 33 ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్, 480 డిగ్రీ లెక్చరర్లు,324 టీజీటీ, 235 పీజీటీ, 185 జూనియర్ లెక్చరర్, 60 ల్యాబ్ అసిస్టెంట్, 37 లైబ్రేరియన్, 33 పీఈటీ పోస్టులు ఉన్నాయి. బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 417 జూనియర్ లెక్చరర్ పోస్టులు గురుకుల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు.
గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో 87 టీజీటీ, 6 ఆర్ట్, క్రాఫ్ట్,మ్యూజిక్ టీచర్ పోస్టులను గురుకుల నియామక బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. సమాచార, పౌరసంబంధాల శాఖలో కూడా 166 పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించింది. వీటిని టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. దీనిలో 4 పీఆర్వో, 16 ఏపీఆర్వో, 82 పబ్లిసిటీ అసిస్టెంట్, 41 అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్, 22 ఇన్ఫర్మేషన్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. బీసీ గురుకుల విద్యాసంస్థల్లో గ్రూప్ – 3 లో 12, గ్రూప్ – 4 కింద 141 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తారు. వీటిని ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్లలో కలిపే అవకాశాలు ఉన్నాయి. మరో 63 స్టాఫ్ నర్స్ పోస్టులను వైద్య, ఆరోగ్యశాఖ నియామక మండలి ద్వారా భర్తీ చేయనున్నారు.
పెరిగిన ఈ 141 ఉద్యోగాల్లో.. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు. బీసీ గురుకులాల్లో జూనియర్ అసిస్టెంట్ (బాయ్స్ ఇనిస్టిట్యూట్ అండ్ మెన్ అండ్ ఉమెన్)లో 86 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ ఇన్ గర్ల్స్ ఇనిస్టిట్యూట్ 55 పోస్టులను గ్రూప్ 4లో కలిపారు. అంతక ముందు పోస్ట్ కోడ్ నంబర్ 11గా పేర్కొని.. అందులో 289 పోస్టులను నోటిఫికేషన్లో పేర్కొన్నారు. తాజాగా దీనిలో మరో 141 పోస్టులను కలపడంతో.. మొత్తం 430కి చేరాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.