హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Andhra Pradesh Jobs : నెల్లూరు జిల్లా ఏసీఎస్ఆర్‌లో ఉద్యోగాలు.. అర్హ‌త‌లు ఇవే

Andhra Pradesh Jobs : నెల్లూరు జిల్లా ఏసీఎస్ఆర్‌లో ఉద్యోగాలు.. అర్హ‌త‌లు ఇవే

నెల్లూరులో ఉద్యోగాలు

నెల్లూరులో ఉద్యోగాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ప్ర‌భుత్వానికి చెందిన నెల్లూరు జిల్లాలోని ఏసీఎస్ఆర్ ప్ర‌భుత్వ వైద్య కళాశాల‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఈ పోస్టుల‌కు అక్టోబ‌ర్ 2, 2021 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...

  ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ప్ర‌భుత్వానికి చెందిన నెల్లూరు జిల్లాలోని ఏసీఎస్ఆర్ ప్ర‌భుత్వ వైద్య కళాశాల‌లో ప‌లు  పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా జ‌న‌ర‌ల్ మెడిస్‌, పీడియాట్రిక్స్‌, టీబీసీడీ, సైకియాట్రిక్‌, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీ(General Surgery), అర్థోపెడిక్స్ (Orthopedics) త‌దిత‌ర విభాగాల్లో 30 పోస్టులు భర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ (Application Process) పూర్తిగా ఆఫ్‌లైన్, ఈమెయిల్ (E-mail) ద్వారా మాత్ర‌మే ఉంటుంది. ఈ పోస్టుల‌కు అక్టోబ‌ర్ 2, 2021 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉంది. నోటిఫికేష‌న్ వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ త‌దిత‌ర వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://spsnellore.ap.gov.in/notice_category/recruitment/ ను సంద‌ర్శించాలి.

  ముఖ్య స‌మాచారం..

  డిపార్ట్‌మెంట్ఖాళీల సంఖ్య‌
  జ‌న‌ర‌ల్ మెడిసిన్‌5
  పీడియాట్రిక్స్‌4
  టీబీసీడీ1
  డీవీఎల్‌1
  సైక్రియార్టి1
  జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీ4
  అర్థోపెడిక్స్‌2
  అప్త‌మాల‌జీ1
  ఓబీజీ3
  రేడియో-డ‌యోగ్న‌సిస్‌3
  అనెస్తియాల‌జీ5
  మొత్తం30


  అర్హ‌త‌లు..

  - ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకొన్న అభ్య‌ర్థులు ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత విభాగాల్లో స్పెష‌లైజేష‌న్ పీజీ, డీఎన్‌బీ పూర్తి చేసి ఉండాలి.

  - విద్యార్హ‌త‌కు సంబంధించిన పూర్తి ధ్రువ‌ప‌త్రాల సాఫ్ట్ కాపీల‌ను త‌యారు చేసుకోవాలి.

  Andhra pradesh Jobs : ప్ర‌కాశం జిల్లా డీఎంహెచ్ఓలో కాంట్రాక్టు ఉద్యోగాలు..


  ఎంపిక విధానం..

  Step 1 : అభ్య‌ర్థుల‌ను పూర్తిగా మెరిట్ (Merit) ఆధారంగా ఉంటుంది.

  Step 2 : పీజీ థియ‌రీ ప‌రీక్ష‌లో వ‌చ్చిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ (Short List) చేస్తారు.

  Step 3 : అనంత‌రం అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూ (Interviews) ల‌ను నిర్వ‌హించి తుది ఎంపిక చేస్తారు.

  ద‌ర‌ఖాస్తు విధానం..

  Step 1 :  ద‌ర‌ఖాస్తు విధానం పూర్తిగా ఆఫ్‌లైన్ (Offline) ద్వారా ఉంటుంది.

  Step 2 :  ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://spsnellore.ap.gov.in/notice_category/recruitment/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

  Step 3 :  అనంత‌రం నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయాలి)

  Step 4 :  నోటిఫికేష‌న్ చివ‌ర‌న అప్లికేష‌న్ ఫాం (Application Form) ఉంటుంది.

  Step 5 :  అప్లికేష‌న్‌ను డౌన్‌లోడ్ చేసుకొని త‌ప్పులు లేకుండా నింపాలి.

  Step 6 :  అప్లికేష‌న్ ఫాంను acsrgmcnlr@gmail.com పంపాలి.

  Step 7 :  అప్లికేష‌న్ ఫాంతో పాటు విద్యార్హ‌త ధ్రువ‌ప‌త్రాల‌ను సాఫ్ట్ కాపీ (Soft copy) ల‌ను పంపాలి.

  Step 8 :  ద‌ర‌ఖాస్తులు పంప‌డానికి చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 2, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Andhra Pradesh, CAREER, Health department jobs, Job notification, Nellore Dist

  ఉత్తమ కథలు