Home /News /jobs /

Andhra Pradesh Inter Admissions: ఏపీలో ఇంటర్ అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే..

Andhra Pradesh Inter Admissions: ఏపీలో ఇంటర్ అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh Inter Admissions Schedule: కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రద్దు కావడం, మార్కుల జాబితాలు ఆలస్యమవడంతో ఇంటర్ అడ్మిషన్లు ఆలస్యమయ్యాయి. అయితే ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యామండలి ఇంటర్ అడ్మిష అడ్మిషన్ల షెడ్యూల్‌ ను ప్రకటించింది.

ఇంకా చదవండి ...
    కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రద్దు కావడం, మార్కుల జాబితాలు ఆలస్యమవడంతో ఇంటర్ అడ్మిషన్లు ఆలస్యమయ్యాయి. అయితే ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యామండలి ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్‌ ను ప్రకటించింది. ప్రభుత్వం వెల్లడించిన  వివరాల ప్రకారం.. ఈనెల 7 నుంచి మొదలవుతుంది. అడ్మిషన్ల కోసం దరఖాస్తులను 7 నుంచి ఆయా కాలేజీల్లో విక్రయించనున్నారు. 17 వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరిస్తారు. 18వ తేదీ సోమవారం విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసి ఆరోజునుంచే తరగతులు ప్రారంభించనున్నారని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

    దరఖాస్తు ఫీజుల వివరాలు..
    ఇంటర్ అడ్మిషన్ దరఖాస్తు ఫీజు కింద జనరల్ కేటగిరీ వారు రూ. 200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆ రసీదుతో కాలేజీకి వెళ్తే సరిపోతుంది. విద్యార్థులు 10వ తరగతి మార్కుల మెమోలు, కుల ధ్రువీకరణ సర్టిఫికేట్లను వెంట తీసుకెళ్లాలని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్‌లో ఫస్టియర్‌ అడ్మిషన్లు నిర్వహించాలన్న ఇంటర్‌బోర్డు నిర్ణయాన్ని హైకోర్టు నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం కాలేజీలకు గతంలో మాదిరిగానే ఈ విద్యా సంవత్సరంలోనూ ఒక్కో సెక్షన్‌కు 88 మంది వరకు విద్యార్థులను చేర్చుకునే అవకాశం ఏర్పడింది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, AP inter board

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు