హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Aarogya Sri Jobs In Ap: ఆరోగ్య శ్రీలో ఉద్యోగాలు.. ఆరోగ్య మిత్ర, టీమ్ లీడర్ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా..

Aarogya Sri Jobs In Ap: ఆరోగ్య శ్రీలో ఉద్యోగాలు.. ఆరోగ్య మిత్ర, టీమ్ లీడర్ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Aarogya Sri Jobs: డా. వై.ఎస్.ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నందు ఖాళీగా ఉన్న ఆరోగ్యమిత్ర , టీం లీడర్ పోస్ట్ లకు ఔట్ సోర్సింగ్ విధానములో ఒక సంవత్సరానికి నియామకాలు చేపట్టనున్నారు. ఈ నియమకాలు మెరిట్ , రిజర్వేషన్ విధానాన్ని అనుసరించి నిర్వహించడతాయి.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లోని నిరుద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్య శ్రీలో(Aarogyasri) ఉద్యోగాలకు నోటిఫికేషన్(Notification) జారీ చేసింది. తూర్పు గోదావరి జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం (DMHO East Godavari) పరిధిలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌లో..ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్.. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఆరోగ్య మిత్ర(Mitra), టీమ్‌ లీడర్‌(Team Leader) పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీనికి దరఖాస్తుల ప్రక్రియ జూలై 21 నుంచి మొదలైంది. జూలై 28వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

IBPS Clerk Preparation Tips: ఐబీపీఎస్ పరీక్షలో Mathematics అంటే భయపడుతున్నారా.. ఇలా చేస్తే మార్కుల పంట పండినట్లే..


ఆరోగ్య మిత్రలు, టీమ్ లీడర్ మొత్తం పోస్టులు కలిపి 22 ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఆరోగ్య మిత్ర పోస్టులు 20 ఖాళీగా ఉండగా.. టీమ్ లీడర్ పోస్టులు 2 ఖాళీగా ఉన్నాయి. వీటిని పూర్తిగా ఔట్ సోర్సింగ్(Out Sourcing) ప్రాతిపదిక ఎంపిక చేయనున్నారు. పూర్తి వివరాలను ఇక్కడ క్లిక్ చేయండి.  ఆరోగ్య మిత్రలకు నెలకు రూ.15 వేలు చొప్పున, టీమ్ లీడర్లకు రూ.18,500 చొప్పున జీతం చెల్లిస్తారు. అభ్యర్థుల విద్యార్హతలో మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 42 ఏళ్లలోపు వయసున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంప్యూటర్ పరీక్ష సమయంలో అభ్యర్థులు ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లాంటి ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తీసుకొని రావాల్సి ఉంటుందని సూచించారు. రెజ్యుమ్ తోపాటు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ తీసుకొని రావాలని సూచించారు.

ఆరోగ్య మిత్ర ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారికి.. బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీ.ఫార్మసీ, ఫార్మా-డీ, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ డిగ్రీల్లో ఏదో ఒకటి ఉండాలి. టీమ్ లీడర్లుగా పని చేయాలని అనుకునేవారికి సైతం పైన పేర్కొన్న విద్యార్హతలతోపాటు హాస్పిటల్ సర్వీసెస్‌లో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. దానితో పాటు ఏదైనా కంప్యూటర్ కోర్సు చేసి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్‌తోపాటు అటెస్ట్ చేయించిన సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను డాక్టర్ వైఎస్సార్ District Medical and Health Office, Kakinada District, AP అడ్రస్ కు పంపంచాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://eastgodavari.ap.gov.in/notice_category/recruitment/ మరియు https://eastgodavari.ap.gov.in/వెబ్ సైట్ ను సందర్శించి తెలుసుకోవచ్చు.

Published by:Veera Babu
First published:

Tags: Aarogyasri, Andhra Pradesh Government Jobs, Andhra pradesh news, Ap jobs, Career and Courses, JOBS, Jobs in ap, Private Jobs

ఉత్తమ కథలు