news18-telugu
Updated: August 19, 2020, 10:32 AM IST
Andhra University: డిస్టెన్స్‌లో డిగ్రీ చేయాలా? ఇలా అప్లై చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ కోర్సులను అందిస్తోంది. 2020-21 విద్యాసంవత్సరంలో బీఏ, బీకాం లాంటి కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్లు ఇవ్వనుంది. 18 ఏళ్లు పూర్తైనవారు ఎవరైనా ఈ కోర్సులకు అప్లై చేయొచ్చు. ఇతర విద్యార్హతలు అవసరం లేదు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ పాసైనవారికి బీఏ, బీకాం డిగ్రీ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో ఆంధ్రా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో అడ్మిషన్ లభిస్తుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 2 చివరి తేదీ. ఆలస్య రుసుముతో 2020 సెప్టెంబర్ 7 వరకు అప్లై చేయొచ్చు. సెప్టెంబర్ 13న ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుంది. మరిన్ని వివరాలకు ఆంధ్ర యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ https://www.andhrauniversity.edu.in/ చూడొచ్చు. దరఖాస్తు ఫామ్‌ను ఇదే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌంటర్లో డీడీ ఇచ్చి దరఖాస్తు ఫామ్ కలెక్ట్ చేసుకోవచ్చు.
IBPS PO: డిగ్రీ పాసైనవారికి 1167 బ్యాంకు ఉద్యోగాలు... ఖాళీల వివరాలివేUPSC CAPF Recruitment 2020: కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాలు... అప్లై చేయండిలా

Andhra University: డిస్టెన్స్‌లో డిగ్రీ చేయాలా? ఇలా అప్లై చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)
Andhra University Distance Education: గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇవే...
డిగ్రీ కోర్సులు- బీఏ, బీకాంపెనాల్టీ లేకుండా దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 2
రూ.100 పెనాల్టీతో దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 7
ప్రవేశ పరీక్ష- 2020 సెప్టెంబర్ 13
దరఖాస్తు ఫీజు- పోస్టు ద్వారా రూ.225. నేరుగా చెల్లిస్తే రూ.200.
డీడీ తీయాల్సిన విధానం: Registrar, Andhra University, Visakhapatnam.
Published by:
Santhosh Kumar S
First published:
August 19, 2020, 10:32 AM IST