ఆగ్నేయ బంగాళాఖాతంలో మాండూస్ తుఫాన్ కొనసాగుతోంది. ఈ రోజు అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఈ తుఫాన్ కారణంగా ఉమ్మడి చిత్తూరుతో పాటు నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా సెలవులు ప్రకటించారు. ఇంకా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్న 210 మండలాల్లో అధికారులకు సెలవులు రద్దు చేశారు. భారీ ఈదురుగాలల కరాణంగా ఆయా ప్రాంతాల్లో చలి తీవ్రం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిత్తూరు జిల్లాలోని స్కూళ్లకు, కాలేజీలకు ఈ రోజు మధ్యాహ్నం నుంచి సెలవులను చిత్తూరు కలెక్టర్ హరి నారాయణ ప్రకటించారు. పాఠశాలల పున:ప్రారంభంపై తిరిగి సమాచారం ఇస్తామన్నారు. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే.. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) అలర్ట్ అయ్యారు. ఆ మూడు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. అధికారులతో సమీక్ష చేశారు జగన్.. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని.. పంటలకు నష్టం వాటిళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.. అలాగే ముంపు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా అలర్ట్ చేయాలని.. టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయాలన్నారు.. ప్రస్తుతం తుఫాను దూకుడు చూ్తుంటే.. రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. ప్రస్తుతం తుఫాను చెన్నైకి ఆగ్నేయంగా 640 కి.మీ దూరంలో ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో చెన్నైతో పాటు తమిళనాడులోని ఇతర జిల్లాల్లో, ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఉత్తర తమిళనాడు , పుదుచ్చేరి , దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను మధ్య శుక్రవారం రాత్రి సమయంలో గంటలకు 67-75 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దూసుకొస్తున్న తుఫాన్ కారణంగా శనివారం వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లోని కొన్ని చోట్ల, ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP Schools, Cyclone, JOBS, School holidays