హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Andhra Pradesh Govt Jobs: ఏపీలోని నిరుద్యోగులకు ఎంపీ విజయసాయిరెడ్డి శుభవార్త.. APPSC నోటిఫికేషన్ల విడుదలపై కీలక ప్రకటన.. వివరాలివే

Andhra Pradesh Govt Jobs: ఏపీలోని నిరుద్యోగులకు ఎంపీ విజయసాయిరెడ్డి శుభవార్త.. APPSC నోటిఫికేషన్ల విడుదలపై కీలక ప్రకటన.. వివరాలివే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల(AP Govt Jobs) భర్తీ విషయంలో వైసీపీ ముఖ్య నేత, ఎంపీ విజయసాయిరెడ్డి(VijayaSai Reedy) కీలక కీలక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి (Andhra Pradesh Government Jobs) సంబంధించి రాజ్యసభ్య సభ్యుడు విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) తాజాగా కీలక ప్రకటన చేశారు. త్వరలోనే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Jobs Notification) విడుదల కానున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మొత్తం 1,180 ఉద్యోగాల భర్తీకి APPSC నుంచి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు చెప్పారు. ఇప్పటికే తమ ప్రభుత్వం నోటిఫికేషన్ల జారీకి అనుమతులు ఇస్తూ జీవో సైతం జారీ చేసిందని విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ మేరకు ఆయా ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోందని ఆయన వివరించారు. దీంతో పాటు రిజర్వేషన్ అభ్యర్థుల గరిష్ట వయో పరిమితి పెంపునకు ప్రతిపాదనలు పంపినట్లు విజయసాయి వివరించారు. EWS కోటా రిజర్వేషన్ల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఇదిలా ఉంటే.. ఏపీలోని వైఎస్ జగన్(AP CM Jagan) ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 10,143 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎం జూన్ లో జాబ్ క్యాలెండర్ ను సైతం విడుదల చేసి రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ విషయంలో కొత్త ఒరవడిని తీసుకువచ్చారు.

AP Jobs: ఏపీలోని ఆ ప్రభుత్వ విభాగంలో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థుల ఎంపిక

మార్చి 2022 వరకు భర్తీ చేసే ఉద్యోగాల ఖాళీల వివరాలను ఆ జాబ్ క్యాలెండర్ లో ఉంచారు. ఏళ్లుగా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మనోధైర్యం కోల్పోకుండా ఉద్యోగాలను భర్తీ చేపట్టినట్లు సీఎం ఆ సమయంలో వివరించారు. ఇందులో భాగంగా ఏ నెలలో ఏ ఉద్యోగాల భర్తీ జరుగుతుందో అభ్యర్థులకు ముందుగానే తెలిసేలా జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చినట్లు సీఎం వివరించారు.

Anganwadi Jobs in AP: ఏపీలో టెన్త్ పాసైన మహిళలకు శుభవార్త.. అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి

జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది జూలై నుంచి నెలల వారీగా చేపట్టనున్న నియామకాల వివరాలు ఇలా ఉన్నాయి:

జూలై-2021: బ్యాక్‌లాగ్‌ వేకెన్సీలు-ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు - 1,238

ఆగస్టు-2021: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 & గ్రూప్‌ 2-36

సెప్టెంబర్‌-2021: పోలీస్‌ శాఖ ఉద్యోగాలు-450

అక్టోబర్‌-2021: వైద్య శాఖలో డాక్టర్స్ & అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు - 451

నవంబర్‌-2021: వైద్య శాఖలో పారామెడికల్‌, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు- 5,251

డిసెంబర్‌-2021: వైద్య శాఖలో నర్సులు - 441

జనవరి-2022: విద్యాశాఖ- లెక్చరర్లు (డిగ్రీ కాలేజీ) - 240

ఫిబ్రవరి-2022: విద్యాశాఖ- అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు (యూనివర్సిటీలు) - 2,000

మార్చి-2022: ఇతర శాఖలు - 36

భర్తీ చేయనున్న మొత్తం ఉద్యోగాలు: 10,143

First published:

Tags: Andhra Pradesh Government Jobs, APPSC, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, Vijayasai reddy

ఉత్తమ కథలు