Andhra Pradesh Anganwadi Recruitment 2019 | ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫామ్‌ను అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో తీసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్‌ను పూర్తి చేసి నవంబర్ 30 లోగా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేసి రసీదు తీసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ చిత్తూరు జిల్లాలో మెయిన్ అంగన్వాడీ వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దరఖాస్తుకు మరో 2 రోజులే గడువుంది. మొత్తం 489 ఖాళీలున్నాయి. చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం, చంద్రగిరి, కుప్పం, మదనపల్లె, నగరి, పలమనేరు ప్రాంతాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. దరఖాస్తుకు నవంబర్ 30 చివరి తేదీ. మహిళలు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://chittoor.ap.gov.in/ వెబ్సైట్లో చూడొచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫామ్‌ను అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో తీసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్‌ను పూర్తి చేసి నవంబర్ 30 లోగా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేసి రసీదు తీసుకోవాలి.
AP Anganwadi Worker Helper Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...
మొత్తం ఖాళీలు- 489
అంగన్వాడీ హెల్పర్- 343
మినీ అంగన్వాడీ వర్కర్- 83
మెయిన్ అంగన్వాడీ వర్కర్- 63
ప్రాంతాల వారీగా ఖాళీల వివరాల కోసం ఈ చార్ట్ చూడండి.
AP Anganwadi Worker Helper Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...
దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 21
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 30
విద్యార్హత- 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష పాస్ కావాలి.
ఇతర అర్హతలు- పెళ్లికాని యువతులు, మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. పోస్టు ఖాళీగా ఉన్న గ్రామానికి చెందినవారు మాత్రమే అప్లై చేయాలి. అందుకే దరఖాస్తు చేసేముందు మీరు ఉన్న ప్రాంతంలో ఖాళీల వివరాలను తెలుసుకోవాలి.
వయస్సు- 2019 జూలై 1 నాటికి 21 నుంచి 35 ఏళ్లు.
వేతనం- అంగన్వాడీ వర్కర్‌కు రూ.11500, మినీ అంగన్వాడీ వర్కర్‌కు రూ.7000, అంగన్వాడీ హెల్పర్‌కు రూ.7000.
నోటిఫికేషన్‌తో పాటు ప్రాంతాల వారీగా ఖాళీలు, అర్హతలు, దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.