Home /News /jobs /

AP Jobs: ఏపీలో నేడు జాబ్ మేళా.. Samsung, Justdial సంస్థల్లో ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. రూ. 23 వేల వరకు వేతనం

AP Jobs: ఏపీలో నేడు జాబ్ మేళా.. Samsung, Justdial సంస్థల్లో ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. రూ. 23 వేల వరకు వేతనం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఈ రోజు మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనుంది. ఇంటర్, డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డవల్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. మరో జాబ్ మేళా (Job Mela) కు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఈ రోజు (ఈ నెల 8న) జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ సంస్థలైన సాంసంగ్ (SAMSUNG), జస్ట్ డయల్ (Justdial) సంస్థల్లో ఖాళీల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్ నుంచి డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ జాబ్ మేళాకు హాజరు కావొచ్చని ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు రూ. 12,500 నుంచి రూ. 23 వేల వరకు వేతనం చెల్లించనున్నట్లు వెల్లడించారు.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    జస్ట్ డయల్ (Justdial): ఈ సంస్థలో మొత్తం 60 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటీవ్ (BDE) విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు రాష్ట్రంలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల వయస్సు 20-30 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.17 వేల నుంచి రూ.23 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ సైతం చెల్లించనున్నారు.
    Jobs in Andhra Pradesh: విజ‌య‌వాడ‌ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో 117 ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

    సాంసంగ్ మొబైల్స్ (Samsung Mobiles): ఈ సంస్థలో 18 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఫుల్ టైమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు. ఇంటర్/డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 12,500 వేతనంతో పాటు PF+ESIతో పాటు 50 వేల వరకు ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నారు. అభ్యర్థుల వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు ప్రొద్దుటూరు, కడప, మైదుకూరు, పులివెందుల, కోడూరు, రాయచోటిలో పని చేయాల్సి ఉంటుంది.
    AP Govt Jobs: నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి



    ఇతర వివరాలు..
    -అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
    -అనంతరం ఈ నెల 8న ఉదయం 9 గంటలకు కడప జిల్లాలోని ప్రొద్దుటూరులోని రాణి తిరుమల దేవీ డిగ్రీ కాలేజీ (RTD)లో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
    -ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు Resume, విద్యార్హతల సర్టిఫికేట్లు, ఆధార్ జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
    -అభ్యర్థులు ఇతర పూర్తి వివరాల కోసం 6303328587, 9063623706 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Job Mela, JOBS, Kadapa, Private Jobs, Samsung

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు