Home /News /jobs /

Job Mela in AP: ఏపీలో నేడు భారీ జాబ్ మేళా.. Airtel, Apollo, Varun Motors తదితర ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు.. వివరాలివే

Job Mela in AP: ఏపీలో నేడు భారీ జాబ్ మేళా.. Airtel, Apollo, Varun Motors తదితర ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఈ రోజు (ఈ నెల 6న) కాకినాడలో భారీ జాబ్ మేళాను నిర్వహిస్తోంది. Airtel, Apollo, Varun Motors తదితర సంస్థల్లో ఖాళీలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. వరుసగా జాబ్ మేళాలు (Job Mela) నిర్వహిస్తున్న సంస్థ తాజాగా మరో జాబ్ మేళాను (Job Mela) నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ప్రకటన (Job Notification) విడుదల చేసింది. Vishal Mega Mart, Kutumbh Care(Airtel Payments Bank), Varun Motors, Appollo Pharmacy తదితర సంస్థల్లో ఖాళీల కోసం ఈ నెల 6న కాకినాడ (Kakinada) లో ఇంటర్వ్యూలను (Job Interviews) నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. టెన్త్ నుంచి బీఫార్మసీ, డిగ్రీ విద్యార్హతలు కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    Vishal Mega Mart: ఈ సంస్థలో 15 ఖాళీల కోసం ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. Sales & Marketing/Visual Merchandising తదితర విభాగాల్లో ఈ ఖాళీలను అప్లై చేస్తున్నారు. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.10,500 వేల వేతనం చెల్లించనున్నారు. పురుషులు/స్త్రీలు ఎవరైనా ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    Kutumbh Care(Airtel Payments Bank): ఈ సంస్థలో మొత్తం 25 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. Field Sales Promoters విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు. ఇంటర్, డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.16,200 వరకు వేతనం చెల్లించనున్నారు. అయితే ఈ ఖాళీలకు కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    BRO Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

    Varun Motors: ఈ సంస్థలో మొత్తం 10 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. Evaluators విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు. ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల వేతనం చెల్లించనున్నారు. అయితే ఈ ఖాళీలకు కూడా కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
    Apollo Pharmacy: ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్&ఫార్మసీ ట్రైనీ విభాగంలో మొత్తం 60 ఖాళీలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేస్తున్నారు. టెన్త్, బీఫార్మసీ, డీఫార్మసీ, ఎంఫార్మసీ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
    Jobs in AP: ఏపీలో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

    ఇతర వివరాలు..
    -అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముంగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
    -ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో Resume, విద్యార్హతలు సర్టిఫికేట్లు, ఆధార్ జిరాక్స్ ను వెంట తీసుకురావాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    -ఎంపికైన అభ్యర్థులు ఈస్ట్ గోదావరి జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది.
    -అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9010737998, 8331890681 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.



    ఇంటర్వ్యూ వేధిక: అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు Rajiv Gandhi Institute of Management & Scienc, Ramanaiahhpeta, Near Sarpavaram Junction, SRMT Mall (Back Side) - Kakinada చిరునామాలో ఈ నెల 6 ఉదయం 10 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh Government Jobs, Job Mela, Private Jobs, State Government Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు