ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా 20 రోజులే.. తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి ఎగ్జామ్స్ హడావుడి ఎప్పుడో మొదలైంది. పుస్తకాలతో పిల్లలు కుస్తీపడుతున్నారు.. టాప్ స్కోర్ టార్గెట్‌గా.. కొంతమంది పాస్ అవ్వడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారు. ఇక అటు ఏపీ ప్రభుత్వం కూడా పరీక్షా ఎర్పాట్లు చకచకా చేస్తోంది. ఈ క్రమంలోనే హాల్ టికెట్లను విడుదల చేసింది.
ఏప్రిల్ మూడు నుంచే:
ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3 నుంచి జరిగే పదో తరగతి ఫైనల్ ఎగ్జామ్స్‌ల హాల్‌టిక్కెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షల హాల్‌టిక్కెట్లను SSC తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన బోర్డు.. తాజాగా హాల్ టికెట్లను రిలీజ్ చేసింది. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 3: ఫస్ట్ లాంగ్వేజ్, ఏప్రిల్ 6: సెకండ్ లాంగ్వేజ్, ఏప్రిల్ 8: ఆంగ్లం, ఏప్రిల్ 10: గణితం, ఏప్రిల్ 13: సామాన్య శాస్త్రం, ఏప్రిల్ 15: సాంఘిక శాస్త్రం, ఏప్రిల్ 17: కాంపోజిట్ కోర్సు , ఏప్రిల్ 18: వొకేషనల్ కోర్సు పరీక్ష జరగనుంది. ఎస్‌ఎస్‌సీ వెబ్‌సైట్‌లో విద్యార్థులు తమ జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీని ఎంటర్ చేసి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. https://bse.ap.gov.in వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇంటర్ హాల్ టికెట్లు కూడా విడుదల:
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎస్సెస్సీ లేదా మొదటి ఏడాది హాల్‌టికెట్ నంబరుతో థియరీ పరీక్షల హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రెండో ఏడాది వారు మొదటి సంవత్సరం లేదా రెండో ఏడాది హాల్‌టికెట్ నంబరుతో డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించారు. హాల్‌టికెట్లలో ఫొటోలు, సంతకాలు, ఇతర సవరణలు అవసరమైతే కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లి, సరిచేయించుకోవాలని శేషగిరిబాబు సూచించారు. మరోవైపు పది, ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలను విద్యాశాఖ అధికారులు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP SSC board exams, Tenth class