Job Mela in Srikakulam | శ్రీకాకుళంలో సెప్టెంబర్ 18న జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళా ద్వారా 1,085 ఉద్యోగాలను భర్తీ చేయనుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC). భర్తీ చేసే పోస్టుల వివరాలు తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) శ్రీకాకుళంలో జాబ్ మేళా నిర్వహిస్తోంది. శ్రీకాకుళంలోని గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ కాలేజీలో సెప్టెంబర్ 18న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా (Job Mela) ప్రారంభం అవుతుంది. పేటీఎం, కియా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అపోలో ఫార్మసీ, మణప్పురం గోల్డ్ లాంటి సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఈ జాబ్ మేళా జరగనుంది. ఆసక్తిగల అభ్యర్థులు https://apssdc.in/ వెబ్సైట్లో రిజిస్టర్ చేయాలి. జాబ్ మేళాలో పాల్గొనే సంస్థల వివరాలు, ఖాళీలు, వేతనాల వివరాలు తెలుసుకోండి.
Deccan Fine Chemicals: డెక్కన్ ఫైన్ కెమికల్స్‌లో ఆర్ అండ్ డీ, ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్ పోస్టులున్నాయి. బీఎస్సీ, ఎంఎస్సీ, బీ పార్మసీ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. మొత్తం 100 పోస్టులున్నాయి. రూ.20,000 నుంచి రూ.21,000 వరకు వేతనం లభిస్తుంది.
Synptic Labs: సినాప్టిక్ ల్యాబ్స్‌లో ట్రైనీ కెమిస్ట్, కెమిస్ట్ పోస్టులున్నాయి. ఇంటర్, బీఎస్సీ, ఎంఎస్సీ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. మొత్తం 60 ఖాళీలున్నాయి. రూ.10,000 నుంచి రూ.14,000 వరకు వేతనం లభిస్తుంది.
Verdant Life Sciences: వెర్డాంట్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్, ఎగ్జిక్యూటీవ్, క్వాలిటీ కంట్రోల్, షిఫ్ట్ ఇంఛార్జ్, వేర్‌హౌజ్ అసిస్టెంట్స్ పోస్టులున్నాయి. బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. మొత్తం 60 ఖాళీలున్నాయి. రూ.16,000 నుంచి రూ.35,000 వరకు వేతనం లభిస్తుంది.
IBST: ఐబీఎస్టీలో డెవలపర్, డాట్ నెట్ డెవలపర్, టెస్టింగ్ ఇంజనీర్, రియాక్ట్ జేఎస్ డెవలపర్, వెబ్ డెవలపర్, ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులున్నాయి. డిగ్రీ, ఎంబీఏ హెచ్ఆర్, బీటెక్ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. మొత్తం 30 ఖాళీలున్నాయి. రూ.7,00,000 వార్షిక వేతనం లభిస్తుంది.
Miracle Software Systems: మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్‌లో సాఫ్ట్వేర్ ట్రైనీ, యూఎస్ ఐటీ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులున్నాయి. డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. మొత్తం 100 ఖాళీలున్నాయి. రూ.1,40,000 నుంచి రూ.3,00,000 వరకు వార్షిక వేతనం లభిస్తుంది.
Jayabheri Automotives: జయభేరి ఆటోమోటీవ్స్లో సేల్స్ ఎగ్జిక్యూటీవ్స్, సర్వీస్ అడ్వైజర్స్, క్యాషియర్స్, స్పేర్ పార్ట్స్ అసోసియేట్ లాంటి పోస్టులున్నాయి. ఐటీఐ మోటార్ మెకానిక్, డిగ్రీ, బీకామ్, డిప్లొమా పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. మొత్తం 45 ఖాళీలున్నాయి. రూ.11,500 నుంచి రూ.14,500 వరకు వేతనం లభిస్తుంది.
Kia Motors: కియా మోటార్స్‌లో ట్రైనీ పోస్టులున్నాయి. డిప్లొమా మెకానికల్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. మొత్తం 50 ఖాళీలున్నాయి. రూ.13,500 వేతనం లభిస్తుంది.
Synergies Castings Limited: సినర్జీస్ క్యాస్టింగ్స్ లిమిటెడ్‌లో ట్రైనీ పోస్టులున్నాయి. ఐటీఐ, డిప్లొమా పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. మొత్తం 50 ఖాళీలున్నాయి. రూ.11,500 నుంచి రూ.14,000 వరకు వేతనం లభిస్తుంది.
Hero Moto Corp: హీరో మోటో కార్ప్‌లో ప్రొడక్షన్ ఆపరేటర్స్ పోస్టులున్నాయి. ఐటీఐ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. మొత్తం 50 ఖాళీలున్నాయి. రూ.14,977 నుంచి రూ.14,000 వరకు వేతనం లభిస్తుంది.
TCL: టీసీఎల్‌లో అసెంబ్లీ, రీవర్క్, టెస్టింగ్ సెక్షన్లో పోస్టులున్నాయి. డిగ్రీ, బీటెక్ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. మొత్తం 50 ఖాళీలున్నాయి. రూ.12,014 నుంచి రూ.14,000 వరకు వేతనం లభిస్తుంది.
Raising Star: రైజింగ్ స్టార్ ఐ టెక్‌లో ఎల్ఈడీ టీవీ అసెంబ్లింగ్ ఆపరేటర్ పోస్టులున్నాయి. టెన్త్, ఇంటర్ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. మొత్తం 50 ఖాళీలున్నాయి. రూ.10,200 వేతనం లభిస్తుంది.
Sri Ranga Motors: శ్రీరంగ మోటార్స్‌లో సేల్స్ ఎగ్జిక్యూటీవ్స్లో పోస్టులున్నాయి. ఇంటర్, బీఎస్సీ, ఎంఎస్సీ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. మొత్తం 10 ఖాళీలున్నాయి. రూ.10,000 వేతనం లభిస్తుంది.
Apollo Pharmacy: అపోలో ఫార్మసీలో ఫార్మాసిస్ట్, ఫార్మసీ ట్రైనీ, ఫార్మసీ అసిస్టెంట్ పోస్టులున్నాయి. ఐటీఐ, బీఫార్మసీ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. మొత్తం 30 ఖాళీలున్నాయి. రూ.11,000 నుంచి రూ.15,000 వరకు వేతనం లభిస్తుంది.
Paytm: పేటీఎంలో సేల్స్ ఎగ్జిక్యూటీవ్స్ పోస్టులున్నాయి. డిగ్రీ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. మొత్తం 25 ఖాళీలున్నాయి. రూ.15,000 వేతనం లభిస్తుంది.
Tata Sky: టాటా స్కైలో ప్రమోటర్స్ పోస్టులున్నాయి. ఇంటర్ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. మొత్తం 50 ఖాళీలున్నాయి. రూ.9,000 వేతనం లభిస్తుంది.
Manappuram Gold: మణప్పురం గోల్డ్‌లో సేల్స్ ఎగ్జిక్యూటీవ్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. డిగ్రీ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. మొత్తం 10 ఖాళీలున్నాయి. రూ.11,000 నుంచి రూ.15,000 వరకు వేతనం లభిస్తుంది.
Innov Source: ఇన్నోవ్ సోర్స్‌లో బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటీవ్, డెలివరీ బాయ్స్ పోస్టులున్నాయి. ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. మొత్తం 50 ఖాళీలున్నాయి. రూ.10,500 నుంచి రూ.15,000 వరకు వేతనం లభిస్తుంది.
HDFC Bank: హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో పలు ఖాళీలున్నాయి. డిగ్రీ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. మొత్తం 20 ఖాళీలున్నాయి. రూ.10,500 నుంచి రూ.15,000 వరకు వేతనం లభిస్తుంది.
Naga Hanuman Fisheries: నాగ హనుమాన్ ఫిషరీస్‌లో స్టోర్స్, మెయింటనెన్స్, అకౌంట్స్, ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్లో పోస్టులున్నాయి. ఐటీఐ, డిగ్రీ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. మొత్తం 20 ఖాళీలున్నాయి. రూ.12,000 నుంచి రూ.15,000 వరకు వేతనం లభిస్తుంది.
Gems Hospital: జెమ్స్ హాస్పిటల్స్‌లో స్టాఫ్ నర్స్ పోస్టులున్నాయి. బీఎస్సీ నర్సింగ్ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. మొత్తం 20 ఖాళీలున్నాయి. రూ.12,000 నుంచి రూ.14,000 వరకు వేతనం లభిస్తుంది.
Raxa Securities: రాక్సా సెక్యూరిటీస్ సొల్యూషన్‌లో సెక్యూరిటీ గార్డ్ పోస్టులున్నాయి. టెన్త్ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. మొత్తం 50 ఖాళీలున్నాయి. రూ.10,000 వేతనం లభిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.