హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Job Mela: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారికి 1,295 ఉద్యోగాలు... రేపు అనంతపురంలో జాబ్ మేళా

Job Mela: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారికి 1,295 ఉద్యోగాలు... రేపు అనంతపురంలో జాబ్ మేళా

Job Mela: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారికి 1,295 ఉద్యోగాలు... రేపు అనంతపురంలో జాబ్ మేళా
(image: APSSDC)

Job Mela: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారికి 1,295 ఉద్యోగాలు... రేపు అనంతపురంలో జాబ్ మేళా (image: APSSDC)

Job Mela in Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) అనంతపురంలో భారీ ఉద్యోగాలతో జాబ్ మేళా నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) పలు పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తోంది. అనంతపురంలోని ఎస్‌వీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్‌లో జాబ్ ఫెయిర్ (Job Fair) నిర్వహిస్తోంది. 2021 సెప్టెంబర్ 17న ఉదయం 9 గంటలకు జాబ్ మేళా (Job Mela) ప్రారంభం అవుతుంది. అమెజాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కియా మోటార్స్, టీసీఎల్, డిక్సన్ లాంటి కంపెనీలు తమ సంస్థల్లో ఖాళీల భర్తీకి ఈ జాబ్ మేళాలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. మొత్తం 20 కంపెనీల్లో 1,295 పోస్టులున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ పోస్టులున్నాయి. అభ్యర్థులు https://apssdc.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయాలి. మరి ఏఏ సంస్థల్లో ఎన్ని పోస్టులున్నాయో, వేతనం ఎంత లభిస్తుందో తెలుసుకోండి.

Kia Motors: కియా మోటార్స్‌లో నీమ్ ట్రైనీ పోస్టులున్నాయి. డిప్లొమా పాస్ అయినవారు అప్లై చేయొచ్చు. మొత్తం 100 ఖాళీలున్నాయి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం రూ.14,000.

Wipro Infrastructure Engineering: విప్రో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్‌లో నీమ్ ట్రైనీ పోస్టులున్నాయి. మొత్తం 30 ఖాళీలున్నాయి. డిప్లొమా, బీటెక్ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 25 ఏళ్ల లోపు ఉండాలి. రూ.13,000 వేతనం లభిస్తుంది.

AP High Court Jobs: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 174 ఉద్యోగాలు... రూ.49,870 వేతనం

Vikasa: వికాసలో నీమ్ ట్రైనీ పోస్టులున్నాయి. డిగ్రీ, బీటెక్, ఐటీఐ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. మొత్తం 50 ఖాళీలున్నాయి. అభ్యర్థుల వయస్సు 19 నుంచి 23 ఏళ్ల లోపు ఉండాలి. రూ.12,000 వేతనం లభిస్తుంది.

Isee Staffing: ఐసీ స్టాఫింగ్ సొల్యూషన్స్ ప్రైవెట్ లిమిటెడ్‌లో అసెంబ్లీ లైన్, క్వాలిటీ చెకింగ్, టెస్టింగ్ లాంటి పోస్టులున్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. మొత్తం 100 ఖాళీలున్నాయి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 ఏళ్ల లోపు ఉండాలి. రూ.11,000 నుంచి రూ.16,000 వరకు వేతనం లభిస్తుంది.

HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సేల్స్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులున్నాయి. డిగ్రీ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. రూ.15,000 వేతనం లభిస్తుంది. మొత్తం 20 ఖాళీలున్నాయి. అభ్యర్థుల వయస్సు 28 ఏళ్ల లోపు ఉండాలి.

IRCTC Recruitment 2021: ఐఆర్‌సీటీసీలో 150 ఉద్యోగాలు... టెన్త్ పాస్ అయితే చాలు

Amazon: అమెజాన్‌లో పికింగ్, ప్యాంకింగ్ అండ్ బార్‌కోడ్ స్కానింగ్ పోస్టులున్నాయి. ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. రూ.13,240 వేతనం లభిస్తుంది. మొత్తం 50 ఖాళీలున్నాయి. అభ్యర్థుల వయస్సు 19 నుంచి 26 ఏళ్ల లోపు ఉండాలి.

TCL: టీసీఎల్‌లో టెక్నీషియన్, ఆపరేటర్, అసెంబ్లర్ లాంటి పోస్టులున్నాయి. టెన్త్, ఇంటర్, డిప్లొమా పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. రూ.13,000 నుంచి రూ.17,000 మధ్య వేతనం లభిస్తుంది. మొత్తం 100 ఖాళీలున్నాయి. అభ్యర్థుల వయస్సు 19 నుంచి 26 ఏళ్ల లోపు ఉండాలి.

Dixon: డిక్సన్ అండ్ ఎయిల్‌డిక్సన్‌లో ఆపరేటర్స్, అసెంబ్లర్స్ పోస్టులున్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, టిప్లొమా పాస్ అయినవారు దరఖాస్తు చేయాలి. రూ.9,500 నుంచి రూ.14,000 మధ్య వేతనం లభిస్తుంది. మొత్తం 100 ఖాళీలున్నాయి. అభ్యర్థుల వయస్సు 19 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి.

AIIMS Mangalagiri Jobs 2021: రూ.2,15,900 వేతనంతో మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాలు

Neolync: నియోలింక్‌లో ఆపరేటర్స్, అసెంబ్లర్స్ పోస్టులున్నాయి. టెన్త్, ఇంటర్ పాస్ అయినవారు దరఖాస్తు చేయాలి. రూ.12,000 వేతనం లభిస్తుంది. మొత్తం 100 పోస్టులున్నాయి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 29 ఏళ్ల లోపు ఉండాలి.

Lighting Technologies: లైటింగ్ టెక్నాలజీస్‌లో మ్యాన్యూఫ్యాక్చరింగ్ పోస్టులున్నాయి. ఐటీఐ, డిప్లొమా పాస్ అయినవారు అప్లై చేయాలి. రూ.12,000 వేతనం లభిస్తుంది. మొత్తం 50 ఖాళీలున్నాయి. అభ్యర్థుల వయస్సు 19 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి.

Futurz: ఫ్యూచర్జ్‌లో పికింగ్, ప్యాకింగ్ పోస్టులున్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారు దరఖాస్తు చేయాలి. రూ.12,000 వేతనం లభిస్తుంది. మొత్తం 100 ఖాళీలున్నాయి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 26 ఏళ్ల లోపు ఉండాలి.

Fresh Minds: ఫ్రెష్ మైండ్స్‌లో ప్రాసెస్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులున్నాయి. డిగ్రీ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. రూ.12,000 వేతనం లభిస్తుంది. మొత్తం 30 ఖాళీలున్నాయి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి.

RWF Recruitment 2021: రైల్వే జాబ్ మీ కలా? రైల్ వీల్ ఫ్యాక్టరీలో 192 ఉద్యోగాలకు అప్లై చేయండిలా

Kyungshin: క్యుంగ్‌షిన్ ఇండస్ట్రియల్ మదర్‌సన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 50 గ్రాడ్యుయేట్ ట్రైనీ, 50 డిప్లొమా ఇంజనీరింగ్ ట్రైనీ, 100 అసోసియేట్ పోస్టులున్నాయి. 8వ తరగతి నుంచి ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 ఏళ్ల లోపు ఉండాలి. రూ.9,000 నుంచి రూ.10,500 మధ్య వేతనం లభిస్తుంది.

Vinuthna Fertilizers: వినూత్న ఫెర్టిలైజర్స్‌లో సేల్స్ రిప్రెజెంటేటీవ్ పోస్టులున్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ పోస్టులున్నాయి. రూ.10,000 నుంచి రూ.13,000 మధ్య వేతనం లభిస్తుంది. మొత్తం 40 ఖాళీలున్నాయి. అభ్యర్థుల వయస్సు 19 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి.

RSMIPL: ఆర్ఎస్ఎంఐపీఎల్‌లో అసెంబ్లింగ్ పోస్టులున్నాయి. ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. రూ.10,500 వేతనం లభిస్తుంది. మొత్తం 40 ఖాళీలున్నాయి. అభ్యర్థుల వయస్సు 19 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి.

Young India: యంగ్ ఇండియాలో ట్రైనీ మేనేజర్ పోస్టులున్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా పాస్ అయినవారు దరఖాస్తు చేయాలి. రూ.8,000 నుంచి రూ.12,000 మధ్య వేతనం లభిస్తుంది. మొత్తం 30 ఖాళీలున్నాయి. అభ్యర్థుల వయస్సు 19 నుంచి 28 ఏళ్ల లోపు ఉండాలి.

Reliance Life Insurance: రిలయెన్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్‌లో లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టులున్నాయి. డిగ్రీ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. రూ.12,000 వేతనం లభిస్తుంది. మొత్తం 15 ఖాళీలున్నాయి. అభ్యర్థుల వయస్సు 29 ఏళ్ల పైన ఉండాలి.

Adecco: అడెక్కోలో ఆపరేటర్స్ పోస్టులున్నాయి. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పాస్ అయినవారు దరఖాస్తు చేయాలి. రూ.13,000 నుంచి రూ.18,000 వేతనం లభిస్తుంది. మొత్తం 80 ఖాళీలున్నాయి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి.

Quess Corp: క్వెస్ కార్ప్‌లో రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటీవ్స్, డెలివరీ బాయ్స్ పోస్టులున్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారుక దరఖాస్తు చేయొచ్చు. రూ.10,000 నుంచి రూ.14,000 వేతనం లభిస్తుంది. మొత్తం 70 ఖాళీలున్నాయి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి.

Airtel: ఎయిర్‌టెల్‌లో సేల్స్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులున్నాయి. టెన్త్ పాస్, ఫెయిల్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. రూ.10,000 వేతనం లభిస్తుంది. మొత్తం 30 ఖాళీలున్నాయి. అభ్యర్థుల వయస్సు 19 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Andhra Pradesh Government Jobs, Andhra pradesh news, Andhra updates, AP News, CAREER, Govt Jobs 2021, Job notification, JOBS, Telugu news, Telugu updates, Telugu varthalu

ఉత్తమ కథలు