ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్-APSSDC ఫేస్‌బుక్‌తో కలిసి డిజిటల్ బేటీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన సీఎస్సీ అకాడమీ, ఫేస్బుక్ సంయుక్తంగా డిజిటల్ బేటీ ప్రోగ్రామ్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, అమ్మాయిలు డిజిటల్ టూల్స్ ఉపయోగించుకొని ఆంట్రప్రెన్యూర్స్‌గా మారేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. టెక్నాలజీ స్కిల్స్ ద్వారా వ్యాపారావకశాలను పెంచుకోవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా 5,000 విలేజ్ లెవెల్ ఆంట్రప్రెన్యూర్స్‌కు డిజిటల్ లిటరసీపైన శిక్షణ ఇవ్వడమే 'డిజిటల్ బేటీ' కార్యక్రమం ఉద్దేశం. శిక్షణ పొందిన 5,000 మంది భారతదేశంలోని 10 రాష్ట్రాల్లో 3,000 గ్రామాల్లో 250,000 రూరల్ ఆంట్రప్రెన్యూర్స్‌కు శిక్షణ ఇస్తారు.
ఈ కార్యక్రమం ద్వారా శిక్షణ పొందే అమ్మాయిలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తమ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచుకోవచ్చు. గ్రూప్స్, పేజెస్ లాంటి ఫేస్బుక్ టూల్స్ ఉపయోగించుకొని తమ బిజినెస్ ఐడియాలకు ఓ రూపం ఇవ్వొచ్చు. అంతేకాదు ఆన్లైన్లో సురక్షితంగా ఉండటం కూడా నేర్చుకుంటారు. ప్రైమరీ స్కిల్స్‌పై ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దృష్టిపెడితే, ఫినిషింగ్ స్కిల్స్ పైన ఫేస్బుక్ కరికులం ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ సేఫ్టీ, ఫేస్బుక్ జాబ్స్ లాంటి అంశాలపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కంటెంట్‌ను తెలుగులో అందిస్తుంది. ఆసక్తి గల అమ్మాయిలు https://www.apssdc.in/ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. విజయవంతంగా పరీక్ష పూర్తి చేసిన అమ్మాయిలకు ఏపీఎస్ఎస్డీసీ, ఫేస్బుక్ సంయుక్తంగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇస్తాయి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.