Home /News /jobs /

ANDHRA PRADESH STATE SKILL DEVELOPMENT CORPORATION ANNOUNCED JOB MELA ON 3 SEPTEMBER HERE FULL DETAILS NS

Job Mela in AP: ఏపీలో మరో భారీ జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ అర్హతతో నాలుగు ప్రముఖ కంపెనీల్లో జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) మరో జాబ్ మేళా(Job Mela)ను ప్రకటించింది. ఈ జాబ్ మేళాలో నాలుగు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ(Job Interviews)లను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు వరంలా మారింది. పలు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీఎస్ఎస్డీసీ నుంచి ఇటీవల వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అవుతున్నాయి. అన్ని రకాల విద్యార్హతలు కలిగిన వారికి తగిన విధంగా ఉద్యోగావకాశాలను కల్పించేందుకు సంస్థ కృషి చేస్తోంది. Flipkart, Amazon, Jio, Airtel, Amara Raja, KIA Motors, Heroతో పాటు అనేక ప్రముఖ సంస్థల్లో ఖాళీల భర్తీకి APSSDC నుంచి ప్రకటనలు విడుదల అవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో జాబ్ మేళాలను సైతం APSSDC నిర్వహిస్తోంది. తాజాగా మరో జాబ్ మేళాను ప్రకటించింది. More Retail India, Airtel Xstram, Rising Stars Hi Tech Pvt Ltd (LED TV Project), Hero Motor Corp తదితర సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాను సెప్టెంబర్ 3న నిర్వహించనున్నారు. అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

    ఖాళీల వివరాలు..























    కంపెనీ పేరు ఖాళీలు
    More Retail India30
    Airtel Xstream15
    Rising Stars Hi Tech Pvt Ltd (LED TV Project)100
    Hero Moto Corp50

    విద్యార్హతల వివరాలు..
    -More Retail Indiaలో 30 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఆపై విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 25 ఏళ్ల లోపు ఉండాలి. ఇందులో పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగాలు ఉన్నాయి. ఫుల్ టైం ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 11,500, పార్ట్ టైం ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 6,400 వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు నూజివీడులో పని చేయాల్సి ఉంటుంది.
    -Airtel Xstram Fiber: సేల్స్ ఎగ్జిక్యూటీవ్ విభాగంలో ఈ సంస్థలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ చేసిన పురుషులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 15 వేల వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు నూజివీడు, గుడివాడలో పని చేయాల్సి ఉంటుంది.
    AP Govt Jobs: ఏపీలోని ఆ ప్రభుత్వ విభాగంలో ఉద్యోగాలు.. భారీగా వేతనం.. ఇలా అప్లై చేసుకోండి

    -Rising StarsHi Tech Pvt Ltd: అసెంబ్లింగ్ ఆపరేటర్ విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన స్త్రీలు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 32 ఏళ్లు ఉండాలి. నెలకు రూ. 10,200 వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు శ్రీ సిటీ, నెల్లూరులో పని చేయాల్సి ఉంటుంది.


    -Hero Moto Corp: ప్రాడక్షన్ ఆపరేటర్ విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఐటీఐ(పురుషులు), ఇంటర్(స్త్రీలు) ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 25 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 14,977 వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థులు శ్రీ సిటీ, నెల్లూరులో పని చేయాల్సి ఉంటుంది.
    AP Job Mela: ఏపీలో మరో భారీ జాబ్ మేళా.. టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా అర్హతతో జాబ్స్.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

    Job Mela Date: సెప్టెంబర్ 3, ఉదయం 10 గంటలు
    Venue: ధర్మ అప్పారావు కాలేజీ(DAR), రైతు బజార్ రోడ్, నూజివీడు, కృష్ణా జిల్లా.
    Registration Link: www.apssdc.in
    Contact Numbers: 8374039719, 9848819682
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Andhra Pradesh Government Jobs, Job Mela, Job notification, JOBS

    తదుపరి వార్తలు