ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 5,000 పైగా పోస్టులున్నాయి. డీజిల్ మెకానిక్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెషినిస్ట్ లాంటి అప్రెంటీస్ పోస్టులున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు 2020 మార్చి 21 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ పోర్టల్ అయిన https://apprenticeship.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి దరఖాస్తు చేయాలి. ఎంపికైన వారు విజయనగరం, విజయవాడ, కడప, నెల్లూరు జోన్లలోని రీజియన్లు, వర్క్‌షాప్‌లో అప్రెంటీస్‌గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు- 5,000 పైగా పోస్టులు
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 21
సర్టిఫికెట్ వెరిఫికేషన్- 2020 ఏప్రిల్ 9
ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన- 2020 ఏప్రిల్ 13
రీజియన్, వర్క్‌షాప్‌ల కేటాయింపు- 2020 ఏప్రిల్ 15
అభ్యర్థులు ముందుగా https://apprenticeship.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Apprentice సెక్షన్‌లో Establishment Search పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Establishment Name లో APSRTC అని టైప్ చేయాలి.
ఆ తర్వాత Andhra Pradesh సెలెక్ట్ చేసి సెర్చ్ చేయాలి.
ఏఏ ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయో లిస్ట్ ఓపెన్ అవుతుంది.
అందులో ఖాళీల వివరాలు తెలుసుకొని https://apprenticeship.gov.in/ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
Doordarshan Jobs: విజయవాడలోని దూరదర్శన్ కేంద్రంలో జాబ్స్... మార్చి 13 లాస్ట్ డేట్
TSPSC Jobs: హైదరాబాద్ వాటర్ బోర్డులో ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్
ISRO Jobs: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని ఇస్రో కేంద్రంలో ఉద్యోగాలు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, Apsrtc, CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION, Rtc, Telugu news, Telugu updates, Telugu varthalu