Results: ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాల విడుదల... చెక్ చేసుకోండి ఇలా

AP Police Constable Mains merit list | 2019 మార్చి 17న ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష జరిగింది. సుమారు 64,574 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అందులో ఎంపికైన 2623 మంది అభ్యర్థుల మెరిట్ లిస్ట్ విడుదల చేసింది.

news18-telugu
Updated: September 12, 2019, 12:01 PM IST
Results: ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాల విడుదల... చెక్ చేసుకోండి ఇలా
Results: ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాల విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హోం మంత్రి మేకతోటి సుచరిత
news18-telugu
Updated: September 12, 2019, 12:01 PM IST
ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు-APSLPRB నిర్వహించిన ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ మెరిట్‌ లిస్ట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హోం మంత్రి మేకతోటి సుచరిత విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఛైర్మన్ కుమార్ విశ్వజిత్ పాల్గొన్నారు. సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వ్, ఏపీఎస్పీ, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, జైల్ వార్డర్స్ విభాగాల్లో మొత్తం 2723 పోస్టులకు 2623 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది పోలీస్ శాఖ. ఎంపికైన అభ్యర్థుల జాబితాను slprb.ap.gov.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది పోలీసు శాఖ. ఫలితాలు, ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే apslprb.pcsobj@gmail.com ఇమెయిల్ ఐడీకి సెప్టెంబర్ 16 లోగా ఫిర్యాదు చేయొచ్చు.

AP Police Constable Mains merit list: పోలీస్ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలను చెక్ చేసుకోండి ఇలా


ముందుగా APSLPRB అధికారిక వెబ్‌సైట్ slprb.ap.gov.in ఓపెన్ చేయండి.

హోమ్ పేజీలో లేటెస్ట్ న్యూస్ సెక్షన్‌లో 'Download the Merit List for the post of Firemen A.P Fire &Emergency Services Department - 2019-09-12' లింక్ పైన క్లిక్ చేయండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. కొత్త పేజీలో రిజల్ట్స్ పేజీ కనిపిస్తుంది.
మీ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత ఫలితాలను చూడొచ్చు.


ఫలితాలను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
Loading...
2019 మార్చి 17న ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష జరిగింది. సుమారు 64,574 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అందులో ఎంపికైన 2623 మంది అభ్యర్థుల మెరిట్ లిస్ట్ విడుదల చేసింది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Honda Activa 125 BS6: కొత్త హోండా యాక్టీవా ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

Railway Jobs: పశ్చిమ రైల్వేలో సీనియర్ క్లర్క్ జాబ్స్... వివరాలు తెలుసుకోండి

Jobs: రామగుండం ఫర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు... పోస్టుల వివరాలివే

DRDO Jobs: డీర్‌డీఓలో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ
First published: September 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...