APSET: ఏపీసెట్‌కు దరఖాస్తు చేశారా? గడువు 2 రోజులే

Andhra Pradesh State Eligibility Test | అక్టోబర్ 20న నిర్వహించబోతోంది ఆంధ్ర యూనివర్సిటీ. ఉదయం 9:30 నుంచి 10:30 వరకు మొదటి సెషన్, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రెండో సెషన్ ఉంటుంది.

news18-telugu
Updated: September 9, 2019, 4:03 PM IST
APSET: ఏపీసెట్‌కు దరఖాస్తు చేశారా? గడువు 2 రోజులే
APSET: ఏపీసెట్‌కు దరఖాస్తు చేశారా? గడువు 2 రోజులే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్-APSET దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 11న ముగియనుంది. ఆ తర్వాత దరఖాస్తు చేయాలంటే ఆలస్య రుసుము చెల్లించాలి. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఏపీ సెట్ నిర్వహిస్తోంది. మాస్టర్స్ డిగ్రీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవాళ్లు ఏపీసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో పాసైతే చాలు. పరీక్షను అక్టోబర్ 20న నిర్వహించబోతోంది ఆంధ్ర యూనివర్సిటీ. ఉదయం 9:30 నుంచి 10:30 వరకు మొదటి సెషన్, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రెండో సెషన్ ఉంటుంది. ఏపీసెట్‌లో 30 సబ్జెక్ట్స్‌ ఉంటాయి. కొత్తగా విజువల్ ఆర్ట్స్ కోర్సును చేర్చారు. అభ్యర్థులందరికీ పేపర్ 1 ఒకేలా ఉంటుంది. పేపర్ 2 సబ్జెక్ట్స్ వారీగా ఉంటాయి.

apset, apset 2019, apset.net.in, apset notification 2019, apset details, andhra pradesh state eligibility test, apset application, apset exam date, ఏపీ సెట్, ఏపీ సెట్ నోటిఫికేషన్ 2019, ఏపీ సెట్ వివరాలు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఏపీ సెట్ దరఖాస్తు, ఏపీ సెట్ పరీక్ష తేదీ

APSET Notification: ముఖ్యమైన తేదీలు ఇవే...


ఏపీసెట్ నోటిఫికేషన్- 2019 జూలై 28
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 ఆగస్ట్ 5
ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుకు చివరి తేదీ- 2019 సెప్టెంబర్ 11
రూ.1,000 ఆలస్య రుసుము + రిజిస్ట్రేషన్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ- 2019 సెప్టెంబర్ 19రూ.2,000 ఆలస్య రుసుము + రిజిస్ట్రేషన్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ- 2019 సెప్టెంబర్ 26
రూ.5,000 ఆలస్య రుసుము + రిజిస్ట్రేషన్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 3 (ఎగ్జామినేషన్ సెంటర్ విశాఖపట్నం మాత్రమే)
ఏపీ సెట్ పరీక్ష- 2019 అక్టోబర్ 20

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అదిరిపోయే ఫీచర్లతో రిలీజైన వివో జెడ్1ఎక్స్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Jobs: ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో 8000 పైగా టీచర్ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Air India Jobs: ఎయిర్ ఇండియాలో 170 అసిస్టెంట్ సూపర్‌వైజర్ పోస్టులు

SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 477 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు
First published: September 9, 2019, 4:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading