ప్రస్తుతం ఎగ్జామ్స్ సీజన్ (Exams Season) నడుస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ జేఈఈ మెయిన్ (JEE Main) పరీక్షలు ప్రారంభం కాగా, మరోపక్క పలు స్టేట్‌బోర్డ్స్ స్టేట్ లెవల్ ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూల్ విడుదల చేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్(APSCHE) చేరింది. 2023-24 అకడమిక్ సెషన్ కోసం వివిధ ఎంట్రన్స్ టెస్ట్‌ల పరీక్షల తేదీలను తాజాగా విడుదల చేసింది.
* 2023-24 అకడమిక్ సెషన్ కోసం
ఏపీలోని కళాశాలలు, యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం APSCHE వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లను నిర్వహిస్తుంది. తాజాగా 2023-24 అకడమిక్ సెషన్ కోసం వివిధ ఎంట్రెన్స్ టెస్ట్‌ల షెడ్యూల్‌ను తాజాగా ప్రకటించింది. వివరణాత్మక పరీక్ష షెడ్యూల్ అధికారిక వెబ్‌సైట్ apsche.ap.gov.inలో అందుబాటులో ఉంది.
* మే5న ఏపీఈసెట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి షెడ్యూల్ ప్రకారం.. ఏపీ ఈసెట్ (AP ECET) మే 5న జరగనుంది. ఏపీ ఈఏపీసెట్ ఎంపీసీ(AP EAPCET MPC) మే15న ప్రారంభమై, మే 22 వరకు జరగనుంది. ఏపీ ఈఏపీసెట్ బైపీసీ(AP EAPCET BiPC) మే 23 నుంచి 25 మధ్య నిర్వహించనున్నారు. ఏపీ ఐసెట్(AP ICET) మే 25, 26 తేదీల్లో నిర్వహించనున్నారు. ఏపీ పీజీ ఈసెట్ (AP PGECET) మే 28 నుంచి 30 మధ్య చేపట్టనున్నారు.ఏపీ లాసెట్(AP LAWCET) మే 20, ఏపీ ఎడ్‌సెట్(AP EDCET) మే 20న, ఏపీ పీజీసెట్(AP PGCET)జూన్ 6 నుంచి 10 వరకు, ఏపీ ఆర్‌సెట్(AP RCET) జూన్ 12 నుంచి 14 వరకు జరగనుంది.
* ఏపీ లాసెట్ మే 20
APSCHE అధికారిక నోటీస్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP LAWCET) 2023 మే 20న జరగనుంది. ఏపీ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP PGCET) 2023 జూన్ 6 నుంచి 10 మధ్య నిర్వహించనున్నారు. ఏపీ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET) 2023 మే 15న జరగనుంది. ఈ టెస్ట్ కోసం ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులతో పాటు ఈ సంవత్సరం ఇంటర్ ఫైనలియర్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి : కాస్మొటాలజిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా..? ఈ గైడెన్స్ మీకోసమే..!
అన్ని ఎంట్రెన్స్ టెస్టుల దరఖాస్తు ప్రక్రియ, పరీక్ష తేదీలు వంటి వివరాలతో వివరణాత్మక నోటిఫికేషన్ నిర్ణీత సమయంలో విడుదల చేయనున్నారు. ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రస్తుతం AP కౌన్సెలింగ్ 2022 ప్రక్రియను నిర్వహిస్తోంది. ఇది జనవరి 31 నాటికి క్లియర్ కానుంది.
ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ బీటెక్, బీఫార్మసీ, ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ వంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్ (EAPCET) పరీక్షను నిర్వహిస్తుంది. ఇక లాసెట్ (LAWCET) ద్వారా మూడేళ్లు, ఐదు సంవత్సరాల లా ప్రోగ్రామ్స్ కోసం అడ్మిషన్ ప్రక్రియను చేపట్టనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Career and Courses, EDUCATION, JOBS